వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంపై పోరు: రోజా ఇలా, చెవిరెడ్డి వివరణ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నిత్యం గందరగోళం చెలరేగుతోంది. మంగళవారంనాడు తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభ్యుల గందరగోళాల మధ్య సభ మూడు సార్లు వాయిదా పడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభ నుంచి సస్పెండ్ చేశారు.

ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. స్పీకర్ తీరును కూడా ఆయన తప్పు పట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు

స్పీకర్ మైకును వైసిపి సభ్యులు విరగ్గొట్టారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళం చెలరేగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు మీడియా పాయింట్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ప్రభుత్వంపైనే కాకుండా స్పీకర్‌పై కూడా వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

నల్లబ్యాడ్జీలతో వైసిపి ఎమ్యెల్యేలు

నల్లబ్యాడ్జీలతో వైసిపి ఎమ్యెల్యేలు

నల్లబ్యాడ్జీలు ధరించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభకు హాజరయ్యారు. మంగళవారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

రోజా ఇలా..

రోజా ఇలా..

ఇతర శాసనసభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఇలా కూర్చున్నారు.

మీడియా పాయింట్ వద్దే...

మీడియా పాయింట్ వద్దే...

శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగుతున్న నేపథ్యంలో వైయస్యార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఆనవాయితీగా మారింది.

జలీల్ ఖాన్ వ్యాఖ్య

జలీల్ ఖాన్ వ్యాఖ్య

టిడిపి ప్రభుత్వం త్వరలోనే కుప్ప కూలుతుందని వైసిపి శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

అగౌరవపరచలేదు..

అగౌరవపరచలేదు..

తాను ఏనాడూ స్పీకర్‌ను అగౌరవపరచలేదని సస్పెన్షన్‌కు గురైన వైసిపి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరణ ఇచ్చారు. తనపై సభా హక్కులు ఉల్లంఘన నోటీసు ఇవ్వడం దారుణమని ఆయన అన్నారు.

అధికార పక్షంపై ఆరోపణ

అధికార పక్షంపై ఆరోపణ

అధికార పక్షం సభ్యులు ఎన్నిసార్లు అసభ్య పదజాలం వాడినా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని, కొంత మంది కూడా తమ పార్టీ శాసనసభ్యులను పందికొక్కులు అంటూ వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు.

English summary

 YS Jagan's lead YSR Congress party MLAs are vehemently attacking Andhra Pradesh CM Nara Chandrababu Naidu's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X