పిల్లలను చంపిన తండ్రి: మరో పెళ్లికేనా? (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని సూరారంకాలనీ, సంతోష్‌నగర్‌లో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఓ వ్యక్తి భోజనంలో విషమిచ్చి చంపాడు. ఆ వ్యక్తిని స్థానిక మహిళలు పట్టుకుని చితకబాదారు. పిల్లలను చంపిన కిరాతకుడ్ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం లక్ష్మి అనారోగ్యానికి గురవగా సంపత్‌కుమార్ గ్రామానికి తీసుకెళ్లి చెట్ల మందులు, ఆకు పసరు వంటివి ఇప్పించాడని, సరైన వైద్యం అందకపోవడం వల్లనే లక్ష్మి మృతి చెందిందని ఆమె సోదరుడు పృధ్వీరాజ్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో చెప్పాడు.

పిల్లలిద్దరితో తాను సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఫోన్‌లో మాట్లాడి, ఇంటికి రమ్మని కోరానని, మంగళవారం వచ్చి తీసుకెళ్ళమని చెప్పారని, అయితే వారి మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుందని ఊహించలేదని పృధ్వీరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన సోదరిని, పిల్లలను పొట్టన పెట్టుకున్న సంపత్‌కుమార్ కొన్ని సంవత్సరాలుగా వ్యసనాలకు బానిసయ్యాడని పృధ్వీరాజ్ ఆరోపించాడు.

మరో మహిళను పెళ్లి చేసుకునే ఆలోచనతోనే పిల్లలను అడ్డు తొలగించుకోవాలని ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని చిన్నారుల అమ్మమ్మ ఆరోపించింది. ఇల్లు తన కూతురు లక్ష్మి పేరుతో ఉన్నదని ఆమె తెలిపింది. ఆ ఇంట్లో గోడలపై ఎటుచూసినా 'మా అమ్మ కరుణ' అనే రాతలు కనిపించాయి.

తండ్రి ఘాతుకానికి పిల్లలు...

తండ్రి ఘాతుకానికి పిల్లలు...

వ్యసనాలకు బానిసైన తండ్రి ఘాతుకానికి ఇద్దరు పిల్లలు బలయ్యారు. వేసవి సెలవుల కోసం వచ్చిన పిల్లలకు విషమిచ్చి చంపాడు.

వేసవి సెలవులకని వస్తే...

వేసవి సెలవులకని వస్తే...

బోరబండలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి పిల్లలు చదువుకుంటున్నారు. వేసవి సెలవులకని తండ్రి వద్దకు వస్తే మృత్యువు కాటేసింది.

తల్లి చనిపోయినా...

తల్లి చనిపోయినా...

అనారోగ్యానికి గురైన తల్లి తండ్రి చెట్ల మందులు, ఆకు పసర్లు పట్టించాడు. దీంతో ఆమె కోలుకోలేదు, మృత్యువాత పడింది. అయినా పిల్లలు అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నారు.

తొలుత బాగానే ఉన్నాడు...

తొలుత బాగానే ఉన్నాడు...

వేసవి సెలవులకు వచ్చిన పిల్లలతో తండ్రి సంపత్ కుమార్ వారం రోజుల పాటు బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాతే ఏమైందో వారికి విషమిచ్చాడు.

బోరుమన్న కుటుంబ సభ్యులు...

బోరుమన్న కుటుంబ సభ్యులు...

పిల్లలు విగతజీవులు కావడంతో మామ పృథ్వీరాజ్, అమ్మమ్మ బోరున విలపించారు. మరో పెళ్లి చేసుకోవడానికే పిల్లలను చంపాడని మామ ఆరోపిస్తున్నాడు.

తాను కూడా విషం తాగాడా...

తాను కూడా విషం తాగాడా...

పిల్లలకు విషమిచ్చిన సంపత్ కుమార్ తాను కూడా విషం తాగాడని అనుమానిస్తున్నారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విషం డబ్బా ఇదే...

విషం డబ్బా ఇదే...

సంపత్ కుమార్ తన తన ఇద్దరు పిల్లలను ముందుకు ప్రణాళిక వేసుకునే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
తల్లి తండ్రి

వరంగల్ జిల్లా, గండిరామారానికి చెందిన కె.సంపత్‌కుమార్ (35)కు నగరంలోని బోరబండకు చెందిన లక్ష్మితో 12 సంవత్సరాల కిత్రం వివాహం జరిగింది. సంపత్‌కుమార్ కుటుంబంతో కలిసి సంతోష్‌నగర్‌లో స్థిరపడ్డాడు. బహుదూర్‌పల్లిలోని సూర్య ట్రాన్స్‌పోర్ట్‌లో డీసిీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి రాకేష్, రాజశ్రీ అనే ఇద్దరు పిల్లలున్నారు. సంపత్‌కుమార్, లక్ష్మి కాపురం కొన్నాళ్లపాటు సవ్యంగానే సాగింది. సంవత్సరం క్రితం లక్ష్మి అనారోగ్యానికి గురి కాగా ఆమెను అక్కడా,ఇక్కడా తిప్పి ఆమె చావుకు సంపత్‌కుమారే కారకుడయ్యాడు.

అప్పటినుంచి ఇద్దరు పిల్లలు బోరబండలోని అమ్మమ్మ వద్దనే ఉంటూ అక్కడే చదువుకుంటున్నారు. ఒంటరి జీవితం గడుపుతున్న సంపత్‌కుమార్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. దూరపు బంధువు అయిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో పిల్లలిద్దరూ పది రోజుల క్రితం తండ్రి వద్దకు వచ్చారు. వారం రోజుల పాటు వారిని బాగానే చూసుకున్న సంపత్‌కుమార్ సోమవారం రాత్రి భోజనంలో విషం కలిపి వారికి తినిపించాడు. అపస్మారకస్థితికి చేరుకున్న పిల్లలిద్దరూ తెల్లారే సరికి మృతిచెందారు.

ప్రతి రోజూ ఉదయాన్నే లేచి తోటి పిల్లలతో ఆడుకునే ఇద్దరు పిల్లలు కనిపించకపోవడం, సంపత్‌కుమార్ ఇంట్లో నుంచి బయటికి ఆందోళనగా, భయంతో తిరుగుతుండటాన్ని గమనించిన స్థానికులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానమిచ్చాడు. అనుమానమొచ్చిన వారు ఇంట్లో కెళ్లి చూడగా రాకేష్ (9), రాజశ్రీ (8) మంచంపై విగతజీవులుగా కనిపించారు. వెంటనే స్థానిక మహిళలంతా గుమిగూడి సంపత్‌కుమార్‌ను చితకబాదారు. వారి దాడితో అతడు స్పృహతప్పాడు.

పోలీసులు సంపత్‌కుమార్‌ను అంబులెన్స్‌లో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన ప్రాధమిక సమాచారం మేరకు పిల్లలిద్దరికి భోజనంలో విషమిచ్చి తండ్రి కూడా విషం తాగినట్టు తెలిసింది. అపస్మారకస్థితిలో ఉన్న సంపత్‌కుమార్ తేరుకుంటే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+