హెలెన్ తుఫాను: తడిసి ముద్ద, పంటలు నష్టం (పిక్చర్స్)

హైదరాబాద్: హెలెన్ తుఫాను రాష్ట్రంలోని పలు జిల్లాలో విధ్వంసం సృష్టించింది. అయితే, ఊహించినంత భయంకరంగా లేకపోవడం కొంత ఊరట. తుఫానుకు ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు సమాచారం. శనివారంనాడు తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ తుఫాను ప్రభాలం గుంటూరు, కృష్ణ జిల్లాలపై ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వాయుగుండం బాపట్లకు సమీపంలో కేంద్రీకృతమైంది.

ప్రజలు తుఫానులో తడిసి ముద్దయ్యారు. పంట నష్టం తీవ్రంగానే జరిగింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి 20,542 మందిని పునారావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

తుఫాను ప్రభావంతో కోస్తా తీరంలో వంద నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో విద్యుత్తు వ్యవస్థ, కమ్యూనికేషన్ టవర్లు దెబ్బ తిన్నాయి. తుఫాను ప్రభావంతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చెదురమొదరు వర్షాలు పడ్డాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో వర్షం..

హైదరాబాద్‌లో వర్షం..

తుఫాను ప్రబావంతో హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాలు పడ్డాయి. వర్షంలోనే వాహనాలు తిరిగాయి.

వర్షంలోనే ఇలా..

వర్షంలోనే ఇలా..

భారీ వర్షంలోనే హైదరాబాద్‌లో ప్రజలు తమ పనులకు వెళ్తూ ఇలా కనిపించారు. గొడుగులు పట్టుకుని వారు రోడ్లపై కనిపించారు.

గొడుగు పట్టి..

గొడుగు పట్టి..

మహిళలు హైదరాబాద్‌లో రోడ్లపై నీళ్లలో ఇలా నడుస్తూ కనిపించారు. వానకు గొడుగులు కప్పుకుని వారు కనిపించారు.

రోడ్లపై ప్రవాహం..

రోడ్లపై ప్రవాహం..

హైదరాబాద్‌లో వర్షం కారణంగా రోడ్లపై ప్రవాహాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు పక్క పక్కన నడుస్తూ ఇలా కనిపించారు.

నీళ్లలోనే రయ్ మంటూ..

నీళ్లలోనే రయ్ మంటూ..

హైదరాబాద్‌లో నీటి ప్రవాహంలోనే వాహనాలు రయ్ మని దూసుకుపోతుంటే, ఓ మహిళ మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తూ.

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జసమయం అయ్యాయి. ప్రజలు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

నీటిని తోలే ప్రయత్నం..

నీటిని తోలే ప్రయత్నం..

నీరు గుడిసె ముందుకు రావడంతో వాటిని పారదోలే ప్రయత్నంలో ఓ వృద్ధురాలు ఇలా... నీరు తొలగేనా.

ఇలా ధ్వంసం

ఇలా ధ్వంసం

హైదరాబాద్‌లో భారీ వర్షాలకు పాత కట్టడాలు దెబ్బ తిన్నాయి. అలా దెబ్బ తిన్న ఓ నిర్మాణాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.

దెబ్బ తిన్న రోడ్డు

దెబ్బ తిన్న రోడ్డు

భారీ వర్షాలకు హైదరాబాద్‌లో రోడ్లు ఇలా దెబ్బ తిన్నాయి. పైలిన్ తుఫానుతో ఇప్పటికే ఓ మారు నష్టపోయిన ప్రాంతం మళ్లీ నష్టానికి గురైంది.

హోరెత్తిన సముద్రానికి సాక్ష్యంగా..

హోరెత్తిన సముద్రానికి సాక్ష్యంగా..

హోరెత్తిన సముద్రానికి, భారీ వర్షానికి సాక్ష్యంగా ఈ విగ్రహం ఇలా కదలకుండా కూర్చుంది.

చెట్లు విరిగి ఇలా

చెట్లు విరిగి ఇలా

హెలెన్ తుఫాను తాకిడికి తూర్పు గోదావరి జిల్లా నర్సాపురంలో చెట్లు విరిగి ఇలా రోడ్డుపై పడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాయి.

పిఎం లంకాలో పోటెత్తిన సముద్రం

పిఎం లంకాలో పోటెత్తిన సముద్రం

తూర్పు గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పిఎం లంకాలో ఇలా సముద్రం పోటెత్తి నీరు ప్రవహించింది.

పంట నష్టం...

పంట నష్టం...

తుఫాను తాకిడికి తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగింది. పచ్చిన పైర్లు నీటి పాలయ్యాయి.

కొబ్బరి తోట నేలపాలు..

కొబ్బరి తోట నేలపాలు..

తూర్పు గోదావరి జిల్లాలో తుఫాను తాకిడికి కొబ్బరి తోట ఛిన్నాభిన్నమైంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రైతు విలవిల..

రైతు విలవిల..

తుఫాను తాకిడికి తూర్పు గోదావరి జిల్లాలో పంట నష్టపోయి రైతు దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాడు.

పోటెత్తిన సముద్రం..

పోటెత్తిన సముద్రం..

విశాఖపట్నం ఆర్‌కె బీచ్ వద్ద సముద్రం పోటెత్తి ఇలా ఉగ్రరూపం దాల్చింది. ఈ వాతావరణంలో ఆటవిడుపా, జాగ్రత్త చర్యలా..

ఆర్‌కె బీచ్ వద్ద ఇలా..

ఆర్‌కె బీచ్ వద్ద ఇలా..

విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్ వద్ద వర్షంలోనూ భీకరమైన సముద్రం సరసన ఇలా బిక్కుబిక్కుమంటూ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+