గవర్నర్‌తో కెసిఆర్: జెఇఇ టాపర్స్ భేటీ ఇలా (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారం బిజీగా గడిపారు. ఆయన గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా నదీ జలాలను ఆంధ్రకు విడుదల చేసే విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆయన గవర్నర్‌ను కలిసినట్లు చెబుతున్నారు.

ఆంధ్రకు తాగునీటి కోసం పది టిఎంసిల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుండగా, తెలంగాణ ప్రభుత్వం కేవలం 2 టిఎంసిలు విడుదల చేయడానికి అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎడమ కాలువ నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు కెసిఆర్‌ను కలిశారు. జెఇఇలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా కెసిఆర్‌ను కలిశారు.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారంనాడు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. కృష్ణా నదీ జలాల వివాదం నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు.

కెసిఆర్‌తో టీచర్స్ భేటీ

కెసిఆర్‌తో టీచర్స్ భేటీ

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నాయకులు మంగళవారంనాడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు.

కెసిఆర్‌కు వినతిపత్రం

కెసిఆర్‌కు వినతిపత్రం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొగ్రెసివ్ రికగ్నజ్డ్ టీచర్స్ యూనియన్ నాయకులు కెసిఆర్‌కు తమ కోర్కెల చిట్టాతో వినతిపత్రం సమర్పించారు.

విద్యార్థులకు అభినందన

విద్యార్థులకు అభినందన

జెఇఇలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారంనాడు అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+