టెక్కీ భవ్యశ్రీ అదృశ్యం: ఏమైంది, మెసేజ్‌లు (పిక్చర్స్)

హైదరాబాద్ : టెక్కీ భవ్యశ్రీ అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఆమె ఆచూకీ లభించినట్లు చెలరేగిన ఊహాగానాల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రైవేటు క్యాబ్‌లో కంపెనీకి బయలుదేరిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భవ్యశ్రీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, కంపెనీకి వెళ్లాల్సిన ఆమె ఎలా దారి తప్పింది? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. విధులకు బయలుదేరిన భవ్యశ్రీ గురువారం అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

భవ్యశ్రీ క్షేమంగా ఉందని కొందరు చెబుతున్నారు. పోలీసులు మాత్రం దీన్ని ద్రువీకరించడం లేదు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆచూకీ లభించలేదని స్పష్టం చేస్తున్నారు. భవ్యశ్రీ గోదావరి జిల్లాల్లో ఉన్నట్టు సమాచారం ఉందని ఆమెకు సమీప బంధువు ఒకరు తెలిపారు. పోలీసులు సాంకేతికపరమైన అంశాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఐదు బృందాలను ఈ కేసు దర్యాప్తునకు నియమించారు.

ఆ వివరాలను మాదాపూర్‌ ఉపకమిషనర్‌ కార్తికేయశర్మ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. భవ్యశ్రీ సెల్‌ నంబర్‌ ఆధారంగా టవర్‌ లోకేషన్‌ వివరాలను పోలీసులు రాబట్టారు. తొలిసారిగా టవర్‌ లొకేషన్‌ సిగ్నల్‌ హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ వద్ద లభించిందని సమాచారం. దీని ప్రకారం అప్పటికి ఆమె క్యాబ్‌లో కంపెనీకి వెళ్తూ ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరో టవర్‌ లొకేషన్‌ దుండిగల్‌లో లభించిందని కొందరు, ధూల్‌పేటలో లభించిందని ఇంకొందరు చెబుతున్నారు. వీటిని మాత్రం పోలీసులు నిర్ధారించడం లేదు. కార్తీక్‌ చైతన్య, భవ్యశ్రీ ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు.

హైటెక్‌సిటీలో గల ఓపెన్‌ టెక్స్ట్‌ టెక్నాలజీస్‌ సంస్థలో భ్యవశ్రీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండగా, డెల్‌ సంస్థలో కార్తీక్‌ చైతన్య హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ రెండు కంపెనీలూ ఒకే ప్రాంగంణంలో ఉన్నాయని తెలిసింది. కేసు వివరాలు బయటకు పొక్కనీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవ్యశ్రీ క్యాబ్‌ ఎక్కిన వెంటనే వాట్సప్‌లో భర్తకు మెసేజ్‌ పంపింది.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

తన భార్య భవ్యశ్రీ కనిపించకపోవడంతో భర్త కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రతి ఇదే. తన భార్య అదృశ్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అతను కోరాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఫ ఉదయం 8.32 గంటలకు ప్రైవేటు క్యాబ్‌లో కంపెనీకి వెళ్తున్నానని భర్త కార్తీక్‌ చైతన్యకు వాట్సప్‌లో సమాచారం పంపింది భవ్యశ్రీ.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఫ ‘ఏ క్యాబ్‌లో వెళ్తున్నావు' అని వెంటనే మళ్లీ మెసేజ్‌ పెట్టాడు కార్తీక్‌ చైతన్య. దీనికి ఆమె నుంచి సమాధానం రాలేదు.

అసలేం జరిగింది

అసలేం జరిగింది

ఉదయం 9.30 గంటలకు మరో మెసేజ్‌ పెట్టాడు. అయినా దానికీ సమాధానం రాలేదు. కొద్ది సేపు ఆగిన తర్వాత కార్తీక్‌చైతన్య...భ్యవశ్రీకి ఫోన్‌ చేశాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఫోన్‌ రింగయినా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. కంపెనీలో పని బిజీలో ఉందేమోనని అనుకున్నాడు కార్తీక్‌ చైతన్య.సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

తర్వాత భవ్యశ్రీకి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. అనంతరం భవ్యశ్రీ కంపెనీ వద్దకు వెళ్లాడు. ఆమె కంపెనీకి రాలేదని ఉద్యోగులు తెలిపారు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

కార్తీక్‌ చైతన్య, భవ్యశ్రీ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ దగ్గరి బంధువులే. ఇద్దరి స్వస్థలం విజయవాడ. దసర పండుగకు ఇద్దరూ విజయవాడ వెళ్లారు. ఇద్దరూ కలిసి కాకుండా వేర్వేరుగా వెళ్లారని తెలిసింది. ముందుగా కార్తీక్‌ చైతన్య విజయవాడలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

కార్తిక్ తిరిగి వచ్చిన తర్వాత భవ్యశ్రీ విజయవాడ వెళ్లింది. రెండు రోజుల క్రితమే విజయవాడ నుంచి కేపీహెచ్‌బీలోని ఇంటికి వచ్చింది. అప్పటినుంచి విశ్రాంతి తీసుకున్న భవ్యశ్రీ గురువారమే విధులకు బయలుదేరిందని సమాచారం.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఇంటికి కలిసి కాకుండా వేర్వేరుగా వెళ్లడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోంది. అటువంటిదేమీ లేదని భవ్యశ్రీ, కార్తీక్‌ చైతన్య తల్లిదండ్రులు అంటున్నారు

వెంటనే అతడు ‘ఏ క్యాబ్‌ ఎక్కావు' అని మెసేజ్‌ చేశాడు. దీనికి ఆమె నుంచి బదులు వెళ్లలేదు. క్యాబ్‌లో ఉన్న భవ్యశ్రీ ఈ మెసేజ్‌ను చూసుకోలేదా? లేక కావాలనే భర్తకు సమాధానం ఇవ్వలేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా భవ్యశ్రీని కిడ్నాప్‌ చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు వేస్తున్నారు. ‘ఇది కిడ్నాప్‌ మాత్రం కాదు' అని భవ్యశ్రీ బంధువు ఒకరు తెలిపారు.

కిడ్నాప్‌ కానప్పుడు భవ్యశ్రీ కంపెనీకి ఎందుకు వెళ్లలేదు? అసలు సెల్‌ఫోన్‌ ఎందుకు స్విచ్ఛాప్‌ చేయాల్సి వచ్చింది? ఆమె ఎక్కిన క్యాబ్‌ ఏ కంపెనీకి చెందినది? అన్న ప్రశ్నలకు భవ్యశ్రీ ఆచూకీ లభించిన తర్వాత చిక్కుముడి వీడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+