పార్కులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూపార్కులో గురువారం ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జూ క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం - విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన యువతీయువకులు గురవారం జూపార్కుకు వచ్చారు.
వారు ఏ సమయంలో జూ పార్కులోకి ప్రవేశించారో తెలియదు గానీ జూ సాగర్ ద్వారం సమీపంలోని మొసళ్ల కొలను వద్ద కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకని తాగారు. దాంతో యువతి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది.
యువకుడు మాత్రం స్పృహలో ఉండి సాయంత్రం ఐదున్నర గంటలకు 108కి ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చిన తర్వాత జూ పార్కు సిబ్బందికి విషయం తెలిసిందే. దీంతో క్యూరేటర్ జి. రామలింగం అక్కడికి చేరుకుని పిఎం పాలెం పోలీసులకు సమాచారం అందించాడు.

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
ఇందిరా గాంధీ జూ పార్కులో గురువారంనాడు ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అందుకు గల కారణాలు తెలియరాలేదు.

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
కూల్ డ్రింకులో పురుగుల మందు తాగిన ప్రేమికులను సిఐ తిరుపతి రావు చికిత్స కోసం కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో యువతీతో పాటు యువకుడు కూడా స్పృహ కోల్పోయారని, వారు స్పృహలోకి వస్తే గాని వివరాలు తెలియవని పోలీసులు అన్నారు.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన యువతీయువకులు ఇందిరాగాంధీ జూపార్కులో కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని తాగారు.












Click it and Unblock the Notifications