భార్య దేవుడి బొట్టు పెట్టి బుజ్జగించింది: దయలేని కసాయి (పిక్చర్స్)

హైదరాబాద్: కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, కన్న కూతురిని సంరెడ్డి రాంరెడ్డి అనే ఉన్మాది దారణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లోని పహాడిషరిఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారమే అతను కుటుంబ సభ్యులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అతడు కొద్దిరోజుల ముందే పదునైన కత్తులు తెచ్చి ఇంట్లో పెట్టాడు.

గురువారం కుటుంబసభ్యులంతా ఒక విందుకు వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చారు. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఇంట్లో తిరుగుతూ భయంగా ఉందని రాంరెడ్డి చెప్పడంతో అతని భార్య దేవుడి దగ్గరి బొట్టు పెట్టి సముదాయించింది. పథకం ప్రకారం నిద్రపోయినట్లు నటించిన రాంరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భార్య రాధిక గొంతు కోసి కిరాతకంగా హత్యచేశాడు. రాధిక కేకలు విని గదిలోకి వచ్చిన పెద్దకూతురు ప్రత్యూష అమ్మను చంపొద్దని వేడుకున్నా వినలేదు.

ఉన్మాదిలా ప్రవర్తిస్తూ మరో గదిలో నిద్రిస్తున్న అతని తల్లి సుభద్ర గొంతు కోసి చంపేశాడు. భయంతో వణికిపోయిన ప్రత్యూష పెద్దగా కేకలు వేయటంతో చిన్న కూతురు అక్షయ కూడా లేచి బయటకు వచ్చింది. ఆమెను పట్టుకున్న రాంరెడ్డి తన కారు తాళాలు ఎక్కడున్నాయంటూ గట్టిగా అరుస్తూ బాలిక మెడకు చున్నీని బిగించి ఆపై గొంతుకోసి హత్యచేశాడు. దాంతో భీతిల్లిన ప్రత్యూష ఇంట్లోని బాత్‌రూంలోకి పరుగెత్తి గడియ పెట్టుకుంది. ప్రత్యూష మాత్రం బతికి బయటపడింది.

సోదరుడూ అదే ఇంట్లో...

సోదరుడూ అదే ఇంట్లో...

హైదరాబాద్ శివారులోని బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధి బాలాపూర్ సాయినగర్‌కు చెందిన సంరెడ్డి బల్వంత్‌రెడ్డి, సుభద్ర దంపతుల ఇద్దరు కొడుకులు రాంరెడ్డి (40), గోవిందరెడ్డి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు.

సోదరుడు పై అంతస్థులో..

సోదరుడు పై అంతస్థులో..

రెండంతస్తుల భవనంలో గోవిందరెడ్డి తన భార్య పిల్లలు, తండ్రితో పైఅంతస్తులో ఉంటుండగా, కింద రాంరెడ్డి తన భార్య రాధిక (38), కూతుర్లు సాయి అక్షయ(14), ప్రత్యూష (15)లతో పాటు తల్లి సుభద్రతో కలిసి నివాసముంటన్నాడు. తండ్రి పొలాలు ఆస్తులను ఇద్దరి కొడుకులకు పంచాడు.

రియల్ దందాలో నష్టం..

రియల్ దందాలో నష్టం..

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రాంరెడ్డి దుబా రా ఖర్చులతో డబ్బంతా పొగొట్టుకున్నాడు. అతడి వ్యవహారాన్ని చూసిన తండ్రి ముందుజాగ్రతగా ఆస్తిని రాంరెడ్డి భార్య రాధిక పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. దాంతో ఆస్తి తన పేరున రాయాలని చాలాసార్లు తల్లిదండ్రులు, భార్య, సోదరుడితో రాంరెడ్డి గొడవలకు దిగే వాడు.

గతంలో ఆత్మహత్యాయత్నం

గతంలో ఆత్మహత్యాయత్నం

ఇంటా, బయటా అందరితో గొడవలు పెట్టుకొని ఉన్మాదిలా మారిన రాంరెడ్డి ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తనకు ఆస్తి రాకుండా తల్లి, భార్య అడ్డుపడుతున్నారన్న అనుమానంతో వారిపై పగ పెంచుకున్నాడని కుటుంబసభ్యులు చెప్తున్నారు.

మరో కూతురిపైనా..

మరో కూతురిపైనా..

రాంరెడ్డి బాత్‌రూం డోర్‌ను కూడా పగలగొట్టే ప్రయత్నం చేయటంతో బాలిక ప్రత్యూష గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని కిందికి వచ్చిన సోదరుడు గోవిందరెడ్డిని కత్తితో బెదిరిస్తూ రాంరెడ్డి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకొన్నారు.

వ్యవసాయపు బావిలో దాక్కున్నాడు...

వ్యవసాయపు బావిలో దాక్కున్నాడు...

స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు రావటంతో గ్రామ శివారులోని ఒక వ్యవసాయ బావిలో దాచుకొనేందుకు రాంరెడ్డి ప్రయత్నించాడు. ఇది పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సాయంతో అతనిని బావిలో నుంచి బయటకు తీసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

భార్యతో ఒకే గదిలో..

భార్యతో ఒకే గదిలో..

గురువారం రాత్రి ఒక గదిలో రాంరెడ్డి, ఆయన భార్య రాధిక పడుకోగా, మరో గదిలో రాంరెడ్డి ఇద్దరు కూతుళ్లు, హాల్‌లో రాంరెడ్డి తల్లి సుభద్ర నిద్రపోయారు. రాత్రి మూడు గంటల సమయంలో రాంరెడ్డి... భార్య రాధికను, ఆ తరవాత తల్లి సుభద్రను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

ప్రత్యూష కేకలు విని...

ప్రత్యూష కేకలు విని...

ప్రత్యూష కేకలు విని పై అంతస్తులో ఉన్న రాంరెడ్డి సోదరుడు గోవింద్‌రెడ్డి, ఆయన భార్య కిందకు దిగారు. కిటికీ గుండా లోపలికి చూసినవారికి హాల్‌లో తల్లి సుభద్ర, తమ్ముడి చిన్న కూతురు అక్షయ రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది.

నా కుటుంబం నా ఇష్టమని...

నా కుటుంబం నా ఇష్టమని...

‘ఎందుకు చంపావని ప్రశ్నిస్తే, నా ఇష్టం.. నా కుటుంబ సభ్యులు. చంపుకుంటాను ఏమైనా చేస్తాను' అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడాడని గోవింద్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు. ఈలోగా స్థానికులు రావడంతో బయటకు పారిపోయి పాతబావిలో దూక్కున్నాడు.

ఇలా బయటకు తీశారు...

ఇలా బయటకు తీశారు...

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి రాంరెడ్డిని బావిలోనుండి బయటకు తీశారు. గత కొంత కాలంగా రాంరెడ్డి ప్రవర్తనలో మార్పు కనిపించడం గమనించామని, అయితే ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదని గోవింద్‌రెడ్డి తెలిపాడు.

ఆస్తి కోసమే..

ఆస్తి కోసమే..

ఆస్తి తనకు దక్కడంలేదన్న కారణంతోనే రాంరెడ్డి ఉన్మాదిగా మారాడని శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అతనిని పూర్తిస్థాయిలో విచారిస్తే ఘటనపై స్పష్టత వస్తుందని చెప్పారు.

ఆస్తి కోసమే..

ఆస్తి కోసమే..

ఆస్తి తనకు దక్కడంలేదన్న కారణంతోనే రాంరెడ్డి ఉన్మాదిగా మారాడని శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అతనిని పూర్తిస్థాయిలో విచారిస్తే ఘటనపై స్పష్టత వస్తుందని చెప్పారు.

ఆస్తి కోసమే..

ఆస్తి కోసమే..

ఆస్తి తనకు దక్కడంలేదన్న కారణంతోనే రాంరెడ్డి ఉన్మాదిగా మారాడని శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అతనిని పూర్తిస్థాయిలో విచారిస్తే ఘటనపై స్పష్టత వస్తుందని చెప్పారు.

ఆస్తి కోసమే..

ఆస్తి కోసమే..

ఆస్తి తనకు దక్కడంలేదన్న కారణంతోనే రాంరెడ్డి ఉన్మాదిగా మారాడని శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అతనిని పూర్తిస్థాయిలో విచారిస్తే ఘటనపై స్పష్టత వస్తుందని చెప్పారు.

ఆస్తి కోసమే..

ఆస్తి కోసమే..

ఆస్తి తనకు దక్కడంలేదన్న కారణంతోనే రాంరెడ్డి ఉన్మాదిగా మారాడని శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అతనిని పూర్తిస్థాయిలో విచారిస్తే ఘటనపై స్పష్టత వస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+