అసెంబ్లీ: చేతిల్లో చేతులేసి మాటలు కలిపారు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాలం సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు వివిధ పార్టీల నాయకులు తమ తమ కండువాలతో, గుర్తులతో శాసనసభకు వచ్చారు. సమైక్య, తెలంగాణవాదాలతో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి శాసనసభ్యులు పలకరించుకున్నారు. కరచాలనాలు చేసుకున్నారు.
గురువారం శాసనసభ మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు నివాళులు అర్పించింది. నల్లసూరీడు నెల్సన్ మండేలాకు నివాళులు అర్పిస్తూ తీర్మానం చేసింది. శుక్రవారం నుంచి సమైక్య, తెలంగాణ నినాదాలతో శాసనసభను వేడెక్కించడానికి తగిన ఏర్పాట్లను అన్ని పార్టీలూ చేసుకున్నాయి.
తెలంగాణకు అనుకూలంగా ఉన్న బిజెపి, సిపిఐ, తదితర పార్టీల శాసనసభ్యులు గన్‌పార్క్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి శాసనసభకు వచ్చారు. తెలంగాణ ముసాయిదా బిల్లు కూడా రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో దాన్ని ఈ సభలోనే ప్రవేశపెట్టాలని ఆ పార్టీలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. సీమాంధ్ర శాసనసభ్యులు సమైక్య తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధపడుతున్నాయి.

సైకిల్‌పై జూలకంటి..
సిపిఎం ఏకైక శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి సైకిల్‌పై శాసనసభకు వచ్చారు. ఆయనతో పాటు అసెంబ్లీ వరకు సిపిఎం కార్యదర్శి బివి రాఘవులుతో పాటు తదితరులు సైకిల్ తొక్కారు.

గులాబీ కండువాలతో తెరాస ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు గులాబీ కండువాలు వేసుకుని శాసనసభకు వచ్చారు. వారి దృష్టంతా తెలంగాణ ముసాయిదా బిల్లుపైనే ఉంది.

అమరవీరుల స్థూపం వద్ద బిజెపి ఎమ్మెల్యేలు
శాసనసభకు రావడానికి ముందు బిజెపి శాసనసభ్యులు జి. కిషన్ రెడ్డి, తదితరులు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

గుండా మల్లేష్‌తో హరీష్
సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్‌ను పలకరిస్తూ తెరాస శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు. తెలంగాణ బిల్లుపై మంతనాలా...

సిపిఐ ఎమ్మెల్యేతో చేతులు కలుపుతూ కిషన్
సిద్ధాంతపరంగా ఉత్తరదక్షిణ ధ్రువాలైన సిపిఐ, బిజెపి శాసనసభ్యులు కలుపుగోలుగా ఇలా కనిపించారు. సిపిఐ శాసనసభ్యుడితో చేతులు కలిపిన జి. కిషన్ రెడ్డి.

అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ ఎమ్మెల్యేలు
శాసనసభకు రావడానికి ముందు సిపిఐ శాసనసభ్యులు గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ శాసనసభ్యులు నివాళులు అర్పించారు.

పాత మిత్రుడు నాగంతో ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీలో తనతో పాటు కలిసి పనిచేసి, ప్రస్తుతం బిజెపిలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డితో ఎర్రబెల్లి దయాకర్ రావు నవ్వుతూ ఇలా..

అమరవీరుల స్థూపం వద్ద టిడిపి టీ ఎమ్మెల్యేలు
శాసనసభకు రావడానికి ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తదితరులు