బాలయ్య హిందూపురం కోటలో రాహుల్ (పిక్చర్స్)
అనంతపురం: తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వివిధ పార్టీల జాతీయ నేతలు సీమాంధ్ర దారి పట్టారు. కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు.
హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి నందమూరి హీరో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఆ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు. పైగా, హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట.
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో సీమాంధ్ర ప్రజలకు విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు హామీలు ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయకుండా, తమ పార్టీ సీమాంధ్ర ప్రజల కోసం చేపట్టే కార్యక్రమాల గురించి వివరించే ప్రయత్నం చేశారు.

దిగ్విజయ్ సింగ్‌తో రాహుల్
అనంతపురం జిల్లా హిందూపురం సభలో వేదికపై దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, పక్కన ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ఇలా...

రాహుల్ సభకు ఇలా...
రాహుల్ సభకు ప్రజలు ఇలా తరలి వచ్చారు. వారికి రాహుల్ గాంధీ కాంగ్రెసు పట్ల విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్ ఎవరి సొత్తూ కాదు...
హైదరాబాద్ ఎవరి సొంత జాగీరు కాదని, సీమాంధ్రుల రక్షణ బాధ్యత పూర్తిగా తమదేనని రాహుల్ గాంధీ చెప్పారు.

రాహుల్ గాంధీ ఇలా...
అనంతపురం జిల్లా హిందూపురం బహిరంగ సభలో రాహుల్ గాంధీకి తల పాగా పెడుతూ ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications