రేవ్ పార్టీపై పోలీసుల దాడి: అరెస్టులు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం ఉప్పర్‌పల్లిలోని లియోనియో రిసార్ట్‌లో అర్థరాత్రి జరుగుతున్న రేవ్‌పార్టీపై పోలీసులు దాడి చేశారు. 30 మంది యువకులు, 10 మంది యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వారి నుంచి పోలీసులు నాలుగు లక్షల రూపాయల నగదును, 35 సెల్‌ఫోన్లను, రెండు లాప్‌టాప్‌లను, ఒక కారను స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి శ్రీనివాస్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
లియోనియా రిసార్ట్స్‌లోని 74 నెంబర్ విల్లాలో నెల రోజుల నుంచి హైదరాబాద్ నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు రేప్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జోనల్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలోని సిబ్బంది ఆదివారం అర్థరాత్రి దాడి చేశారు. వీరికి ఆశ్రయం కల్పించిన రిసార్ట్స్, విల్లా యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని డిసిపి చెప్పారు.

యువతులు ఇలా..
రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులకు చిక్కిన యువతులు ఇలా.. పోలీసులు పది మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

విల్లాలో రేవ్ పార్టీ...
ఉప్పర్‌పల్లిలోని లియోనియో రిసార్స్ట్‌లోని 74 నెంబర్ విల్లాలో నెలరోజులుగా రేప్ పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

పట్టుబడిన తర్వాత ఇలా..
రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో పది యువతులు, 30 మంది యువకులు ఉన్నారు.

వివరాలు ఇలా..
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రమేష్, నెల్లూరు జిల్లాకు చెందిన కరీముల్లా, హైదరాబాద్‌కు చెందిన సార్యారాం, డిజె ఆపరేటర్ రాఖీ తారఖ్, ఉత్తరాదికి చెందిన ఓ యువతి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

వివిధ ప్రాంతాలకు చెందినవారు..
రేవ్ పార్టీని ఏర్పాటు చేసినవారిలో వివిధ ప్రాంతాలకు చెందినవారున్నారు. వీరిలో డిజె ఆపరేటర్ రాఖీ తారఖ్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

గతంలో కూడా..
గతంలో కూడా ఈ ప్రాంతంలో వివిధ కారణాలతో ఏర్పాటైన కార్యక్రమాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications