హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివ బైక్ రేసులో దిట్ట: గడ్డం గీస్తే రూ. 500 (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శంషాబాద్ వద్ద పోలీసు కాల్పుల్లో మరణించిన శివ అలియాస్ సాంబకు సంబంధించిన విషయాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. నార్సింగిలోని శివ ఇంటిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఖరీదైన రెండు లగ్జరీ కార్లతో పాటు స్పోర్ట్స్‌ బైక్‌ ఉపయోగించేవాడని పోలీసులు తెలిపారు. గడ్డం గీయించుకునేందుకు ఇంటికి వ్యక్తిని ప్రతి రోజూ రప్పించుకునేవాడు. గడ్డం చేసిన వ్యక్తి 500 రూపాయలు ఇచ్చేవాడు. ఇంటికి భోజనం తెస్తే రూ. 100 టిప్పుగా ఇచ్చేవాడు.

కూరగాయల మార్కెట్‌లు, పాలబూత్‌ల వద్ద ఒంటరిగా తిరిగే మహిళలే అతడి లక్ష్యం. గతంలో శివ ఒక్కడే చోరీలకు పాల్పడేవాడు. కొద్ది కాలంగా తన క్లాస్‌మేట్‌ జగదీష్‌ సహాయం తీసుకుంటున్నాడు. జగదీష్‌ కాపలాగా ఉండగా శివ మహిళల వద్దకు వెళ్లి అనుమానం రాకుండా చిరునామా అడుగుతున్నట్టు నటించి ఆమె మెడలో ఉన్న గొలుసుతో ఉడాయించేవాడు. కారు వరకు పరుగు తీసి అనంతరం సాధారణ పౌరులు మాదిరిగా కారులో జారుకునేవారు.

శవి ఓసారి ఎల్‌బీనగర్‌లో ఓ సారి దొరికన్నట్టే దొరికి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టాడు. మూడునెలల కోసారి ఇళ్లు, సిమ్‌ కార్డులను మార్చేవాడు. మూడు రోజుల క్రితం శివ నగర శివారు ప్రాం తాల్లో సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి అతణ్ని పట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో శివ పోలీసులపై దాడికి పాల్పడగా చివరకు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఇందులో సీఐ, ఎస్సైలు గాయపడ్డారు.

శివ వాడిన బైక్

శివ వాడిన బైక్

స్నాచింగ్‌లను ఎంత నేర్పుగా చేస్తాడో అంతే చాకచక్యంగా తప్పించుకోవడంలో శివ దిట్ట. స్పోర్ట్‌ బైక్‌ ఉపయోగించే శివ రేసింగ్‌లో ఆరితేరిన వాడు. బైక్‌ను, కార్‌ను గంటకు 150 కిలోమీటర్ల వేగంలో ఎంతటి ట్రాఫిక్‌లోనైనా నడపగలిగేవాడు. ఎన్నో సందర్భాల్లో అతడు స్నాచింగ్‌ చేస్తూ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు.

మోడ్రన్‌గా ఉండాలని...

మోడ్రన్‌గా ఉండాలని...

ఏవైనా డజన్ల కొద్ది కొనడం శివకు అలవాటు. అలాగే తన కుటుంబ సభ్యులకు కొనిపెట్టేవాడు. భార్యను కూడా మోడ్రన్‌గా ఉండాలని చెప్పేవాడు, ఇంట్లో సోదాలు నిర్వహించగా శివకు సంబంధించిన 750 జతల బట్టలు గుట్టలుగా కనిపించాయి.

విహార యాత్రలూ, జల్సాలు...

విహార యాత్రలూ, జల్సాలు...

భార్య పిల్లలతో కలిసి పలు ప్రదేశాలకు వెళ్లిన ఫొటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల వారికి తానో వ్యాపారినని, కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తుంటానని చెప్పేవాడు.

పోలీసులకు సవాల్

పోలీసులకు సవాల్

తాను ఎవరినైనా మోసం చేసి పారిపోగలనని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో శివను పట్టుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. అతడి సెల్‌ఫోన్‌ ట్రేస్‌ చేయడం మొదలు పెట్టారు.

దొరికనట్లే దోరికి

దొరికనట్లే దోరికి

ఎల్‌బీనగర్‌ పోలీసులు కూడా గతంలో శివను పట్టుకునే ప్రయత్నం చేశారు. కాని బైక్‌ మీద స్లిప్‌ ఇచ్చి పారిపోయాడు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ స్కూటీ కూడా కొనుగోలు చేశాడు.

డబ్బు భార్య ఖాతాల్లోకి..

డబ్బు భార్య ఖాతాల్లోకి..

స్నాచింగ్‌ చేసిన తరువాత శివ నగలను అమ్మగా వచ్చిన డబ్బును భార్య, బంధువుల ఖాతాల్లో వేసేవాడు. కొద్ది రోజుల అనంతరం ఆ డబ్బును తన ఖాతాలోకి మార్చుకునేవాడు. శివ క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

సివి ఆనంద్ ఇలా..

సివి ఆనంద్ ఇలా..

గజదొంగ శివకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు వెల్లడించారు.

గంటే పని..

గంటే పని..

శివ లైఫ్‌స్టైలే కాదు దొంగతనాల్లో కూడా కార్పొరేట్‌ స్టైల్‌ను అనుసరించాడు. శివ కేవలం రోజుకు ఓ గంట మాత్రమే పనిచేస్తాడు.

ఖరీదైన ఫర్నీచర్..

ఖరీదైన ఫర్నీచర్..

ఇంట్లో బెల్టులు, బాడీ స్ర్పేలు ఇలా యాక్ససరీలు విచ్చలవిడిగా వాడి పడేసే వాడని స్థానికులు చెప్పారు. నార్సింగిలో డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ను నెలకు రూ. 8500 అద్దె పెట్టి తీసుకున్న శివ దానికి తగ్గట్టుగా ఖరీదైన ఫర్నిచర్‌ను సమకూర్చుకున్నాడు.

ఫోష్‌గా ఇల్లు...

ఫోష్‌గా ఇల్లు...

ఇంటిని అత్యాధునిక వస్తువులతో నింపేసిన శివ కేపీహెచ్‌బీ పోలీసులకు 2012లో చిక్కి నెల రోజులకే జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కేవలం హైదరాబాద్‌, సైబరాబాద్‌లోనే అతడిపై దాదాపు 48 స్నాచింగ్‌ కేసులు ఉన్నాయి.

ఉదయం పూటే..

ఉదయం పూటే..

శివ చోరీ ప్రాంతాలను ఎంచుకోవాలన్నా స్నాచింగ్‌ చేయాలన్నా ఉదయం 7- 8 గంటల మధ్య మాత్రమే చేస్తాడు. మిగతా సమయాల్లో దొంగతనాల జోలికి వెళ్లేవాడు కాడు.

అనుమానం వచ్చేది కాదు..

అనుమానం వచ్చేది కాదు..

శివ జీవనశైలి చూసిన ఇరుగుపొరుగు అతన్ని వ్యాపారవేత్త అనుకునేవారు. అతని జీవన శైలి అనుమానం కలిగించేది కాదు.

కారులో మాత్రమే..

కారులో మాత్రమే..

శివ పోకడ చూసి స్థానికులు వ్యాపారవేత్త అనే అనుకునేవారు. దీంతో అతడి వ్యవహారంపై ఎవరికీ అనుమానం రాలేదు. అతడు ఎక్కడికి వెళ్లినా కారులో మాత్రమే వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు.

దుస్తులే దుస్తులు...

దుస్తులే దుస్తులు...

శివ దుస్తులు పెద్ద మొత్తంలో కొనేవాడు. డజన్ల కొద్దీ కొనేవాడు. ఇంట్లోవాళ్లకు కూడా అలాగే కొనిచ్చేవాడు. ఇలా దుస్తులు..

అత్యాధునికం...

అత్యాధునికం...

చైన్ స్నాచింగులకు పాల్పడే శివ తన ఇంటిని అత్యాధునిక పరికరాలతో నింపేశాడు. అది చూస్తే అతను దొంగ అని ఎవరూ అనుకోరు.

బైకులపై జారుకోవడం...

బైకులపై జారుకోవడం...

శివ చోరీలకు పాల్పడి బైకుపైకి దొరక్కుండా సర్రున జారిపోయేవాడు. అతన్ని చూస్తే ఎవరూ దొంగ అనుకోరు.

పీడ విరగడైంది..

పీడ విరగడైంది..

శివ పోలీసు కాల్పుల్లో హతం కావడంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కూకట్‌పల్లిలో ఇలా సంబరాుల చేసుకుంటూ..

English summary
Police astonished to see the life style of Shiva alias Samba. He acted as a businessman in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X