కెసిఆర్ స్పీడ్: తెరాసలోకి సుగుణకుమారి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో కారు స్పీడ్ పెరిగినట్లు కనిపిస్తోంది. కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి అనూహ్యమైన ప్రాంతాల నుంచి నేతలు వచ్చి చేరుతున్నారు. శుక్రారంనాడు సిపిఐ ఖమ్మం జిల్లా వైరా శానససభ్యురాలు చంద్రావతి పార్టీలో చేరారు.
తాజాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యురాలు సుగుణకుమారి తెరాసలో చేరబోతున్నారు. ఆమె కెసిఆర్‌ను కలిసి తన ఉద్దేశ్యాన్ని వివరించినట్లు సమాచారం. ఆమెకు కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోకసభ స్థానం కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెసు తరపున పోటీ చేసే జి. వివేక్‌ను సుగుణకుమారి పెద్దపల్లి నియోజకవర్గంలో ఢీకొంటారు.
కాగా, శుక్రవారంనాడు తెరాస పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సందడి చోటు చేసుకుంది. తెరాస తొలి విడత జాబితాను కెసిఆర్ విడుదల చేశారు. 69 మంది శాసనసభ సభ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. అదే సమయంలో ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేశారు.

చంద్రావతి తెరాసలోకి..
సిపిఐ ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యురాలు చంద్రావతిని కె. చంద్రశేఖర రావు తెరాసలోకి ఆహ్వానించారు. ఆమెకు సిపిఐ నాయకత్వం తిరిగి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది.

తొలి జాబితాలోని అభ్యర్థులు..
కెసిఆర్ విడుదల చేసిన తొలి జాబితాలో వీరందరికీ టికెట్లు లభించాయి. దీంతో వారు ఆనందోత్సాల మధ్య ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

కొండా సురేఖ ఇలా...
వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం టికెట్ దక్కించుకున్న కొండా సురేఖ తెరాస మహిళా నాయకులతో కలిసి ఇలా కనిపించారు.

తెరాస నేతలు..
తొలి జాబితాలో టికెట్లు పొందిన తెరాస నాయకులు ఇలా సందడిగా కనిపించారు. అంతా గులాబీ కండువాలు కప్పుకుని దర్శనమిచ్చారు.

గులాబీ దళపతి..
శుక్రవారంనాడు గులాబీ దళపతి కె. చంద్రశేఖర రావు ఇలా కనిపించారు. తెలంగాణలో ఇప్పుడు ఆయనే పెద్ద అట్రాక్షన్.

తెలంగాణ తల్లికి నివాళులు..
ఎన్నికల ప్రణాళికను, తొలి జాబితాను విడుదల చేయడానికి ముందు కెసిఆర్ తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లికి నివాళులు అర్పించారు.

ప్రతిజ్ఞ చేస్తూ...
తొలి జాబితాలో టికెట్లు దక్కించుకున్న తెరాస నాయకులు శుక్రవారంనాడు ప్రతిజ్ఞ చేస్తూ ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications