నోరు మంచిదైతే: మోడీతో లింక్‌పై కెసిఆర్, బాబు సంస్కారానికే...

హైదరాబాద్: తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోతున్నట్లు వచ్చిన మీడియా కథనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పందించారు. ఆయన శుక్రవారంనాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ చేరుతుందనే విషయంపై అసలు ఆ అంశంపై చర్చ జరగనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ చర్చ వచ్చినపుడు చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మిమ్మల్ని చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు అని మీడియా ప్రతినిధులు అన్నపుడు నోరు మంచిదైదే... ఊరు మంచిదవుతుంది కదా అని కేసీఆర్ చమత్కరించారు.

సచివాలయంలో మీడియాపై నియంత్రణ మీద కేవలం చర్చ మాత్రమే జరిగిందని ఓప్రశ్నకు ముఖ్యమంత్రి బదులిచ్చారు. అప్రజాస్వామికంగా వ్యవహరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అయితే సచివాలయంలో ఇప్పుడున్నంత విచ్చలవిడిగా మాత్రం పరిస్థితి ఉండరాదని స్పష్టం చేశారు.

చర్చల తర్వాతే..

చర్చల తర్వాతే..

జర్నలిస్టుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఏదైనా సచివాలయంలో నియంత్రణపై నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర ఉండబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారని విలేకరులు తెలిపినపుడు అది వాళ్ల సంస్కారానికే వదిలేస్తామని కేసీఆర్ అన్నారు.

మేం మాత్రం...

మేం మాత్రం...

తాము మాత్రం కచ్చితంగా తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నామని, ఏపీలో ఎవరైనా ఒకటీ, అరా మహానుభావులు ఉంటే కూడా చేరుస్తామని కెసిఆర్ చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలపై..

అసెంబ్లీ సమావేశాలపై..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల పది లోపు ఏదో ఒకరోజు ప్రారంభమవుతాయని కేసీఆర్ చెప్పారు. అయితే తేదీలను ఇంకా నిర్ణయించలేదని, శనివారం అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ను ఈ విషయమై సంప్రదిస్తామని చెప్పారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ అభ్యర్థులు

రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం సీట్లకు పార్టీ అభ్యర్థుల పేర్లు శనివారం సాయంత్రం ప్రకటిస్తామని సీఎం చెప్పారు.

కేంద్ర బడ్జెట్ వస్తేనే..

కేంద్ర బడ్జెట్ వస్తేనే..

తెలంగాణ బడ్జెట్ లక్షకోట్లు ఉంటుందా? అన్న ప్రశ్నకు కేంద్ర బడ్జెట్ వస్తే తప్ప రాష్ట్ర బడ్జెట్ మీద సంపూర్ణ అవగాహన రావడం కష్టమని కెసిఆర్ చెప్పారు.

వివరాలు లేవు..

వివరాలు లేవు..

రాష్ట్ర విభజన అనంతరం అసలు మన రాష్ట్రం ఆదాయమెంత అనేది కచ్చితంగా వివరాలు లేవని, ఇప్పటిదాకా అన్నీ అంచనాలేనని చెప్పారు.

కుదించారు..

కుదించారు..

గతంలో 120కి పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలుండేవని, ఇప్పుడు 66కు కుదించారని, కేంద్రం ఏపథకానికి ఎంతిస్తుందనేది తేలాలని కెసిఆర్ అన్నారు. తర్వాతే అంచనా వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+