టెక్కీ హత్య: బిడ్డ పోయి, పోలీసుల వలలో... (పిక్చర్స్)

గుంటూరు: పరువు కోసం కన్న కూతురి ప్రాణాలను తీసేసిన తల్లిదండ్రులను పోలీసులు మంగళవారంనాడు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో కూతురు దీప్తిని తల్లిదండ్రులు చంపేశారు. ఈ కేసులో దీప్తి తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా దీప్తి హత్యతో తన భార్యకు ఎలాంటి సంబంధం లేదని హరిబాబు చెబుతున్నారు. ప్రేమ వివాహం చేసుకుందనే ఆవేదనతో దీప్తి అనే నవ వధువును కన్న తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం చున్నీతో ఉరివేసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీప్తి తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను వారి బంధువులు సోమవారం పోలీసులకు అప్పగించారు.

ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు గుంటూరుకు వచ్చిన దీప్తి, తన తల్లిదండ్రులతో కలిసి రాజేంద్రనగర్‌లోని ఇంటికి చేరుకుంది. తల్లి సామ్రాజ్యం స్నానానికి వెళ్లింది. కులాంతర వివాహంపై దీప్తికి, తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. మీకు ఇష్టం లేకుంటే తాను ఇంటికి రానని దీప్తి తండ్రికి చెప్పింది. ఆగ్రహం పట్టలేని తండ్రి ఆమె రెండు చెంపల పైన కొట్టాడు. ప్రమాదవశాత్తు కణతపై గట్టిగా తగలడంతో దీప్తి మృతి చెందిందని హరిబాబు చెబుతున్నాడు.

ఏం చేయాలో తెలియక ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకే చున్నీతో మంచానికి కట్టారు. స్నానం చేసి వచ్చిన తల్లి కూతురు చనిపోయి ఉండటం గమనించి కేకలు వేసింది. తండ్రి ఆమెను వారించి బైక్ పైన పారిపోయారు. అయితే, హరిబాబు చెప్పినదాంట్లో వాస్తవం ఎంతుందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మీడియా ముందు ఇలా...

మీడియా ముందు ఇలా...

ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురినే పొట్టన పెట్టుకున్న తల్లిదండ్రులు హరిబాబు, సామ్రాజ్యం ఇలా మీడియా ముందు...

చున్నీతో మంచానికి కట్టేశారు..

చున్నీతో మంచానికి కట్టేశారు..

మరణించిన తర్వాత ఏం చేయాలో తెలియక దీప్తి శవాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చున్నీతో మంచానికి కట్టేశారని అంటున్నారు.

కణతలపై తగిలి..

కణతలపై తగిలి..

ఆగ్రహం పట్టలేక తాను కొట్టిన దెబ్బ ప్రమాదవశాత్తు కణతలపై తగిలిందని, దాంతో తన కూతురు దీప్తి మరణించిందని హరిబాబు అంటున్నాడు.

తల్లికి సంబంధం లేదా..

తల్లికి సంబంధం లేదా..

తన కూతురు మరణంతో తన భార్య సామ్రాజ్యంకు సంబంధం లేదని హరిబాబు చెబుతున్నాడు. కూతురిని పోగొట్టుకుని, తాను పోలీసుల బారిన పడి తల్లి రోదన ఇలా..

ఆగ్రహం పట్టలేకనే..

ఆగ్రహం పట్టలేకనే..

తమ కూతురు తమన నమ్మించి మోసం చేసి వివాహం చేసుకుందని, ఆ ఆవేదనను తట్టులేక తాము ఈ అఘాయిత్యానికి పాల్పడ్డామని తల్లిదండ్రులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకోవాలని...

ఆత్మహత్య చేసుకోవాలని...

కూతురి మరణానంతరం తీవ్ర క్షోభకు గురై తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చిందని అయితే బంధువులు ఆపడంతో పోలీసుల ఎదుట లొంగిపోయామని హరిబాబు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+