జగన్: ఎనిమిది నెలల్లో మూడు సార్లు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ తదితర అంశాలకూ, తనకూ సంబంధం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే గత ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఢిల్లీ వచ్చి ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల్ని కలిసి ఏపీకి ప్యాకేజీపై వినతిపత్రాలు సమర్పించానని చెప్పారు.
ఆదివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాషా్ట్రనికి సంబంధించిన ప్యాకేజీలు, సీఆర్‌డీఏ అమలు వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయం, డ్యాముల్లో గేట్లు ఎత్తి భావోద్వేగాలను రెచ్చగొట్టి గొడవలకు దిగిన విషయంపై రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశానని చెప్పారు.
పారిశ్రామిక రాయితీలు, బడ్జెట్ లోటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజీలు, రాజధానికి భూముల సేకరణ, కేంద్ర సంస్థల ఏర్పాటు, రైల్వేజోన్ ఏర్పాటు మొదలైన అంశాలపై కూలంకషంగా లేఖలు రాసి కేంద్రమంత్రులకు ఇచ్చామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాల గురించి చంద్రబాబునే అడగాలని ఒక ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు.

వారు కలిసే ఇలా..
ఆనాడు చంద్రబాబు, కాంగ్రెస్, బీజేపీలు కలిసి, ప్రత్యేకహోదా విషయాన్ని చట్టంలో పొందుపర్చకుండానే రాష్ట్రాన్ని విడగొట్టారని జగన్ అన్నారు.

అప్పుడే ఆపి ఉంటే..
అప్పుడే రెండు రోజులు విభజన ఆపి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టి రాష్ట్రాన్ని విడగొడితే ఇంతదారుణమైన పరిస్థితి వచ్చేది కాదని జగన్ అన్నారు.

రాజకీయం కోసమే చంద్రబాబు
రాజకీయ ప్రయోజనం కోసమే తెలంగాణలో పర్యటించిన చంద్రబాబు వరంగల్‌కు వెళ్లి తెలంగాణకు తొలి ఓటు వేసిన సంగతి చెప్పారని జగన్ అన్నారు.

బలవంతం వద్దు
రాజధానికి బలవంతంగా భూములు తీసుకోకుండా చూడాలని ఇంతకు ముందు కూడా రైతులు ఢిల్లీ వచ్చి కేంద్రాన్ని కోరారని, తాము తీసుకొచ్చినా, ఇంకొకరు తీసుకొచ్చినా అంతకు మించి చేయగలిగింది ఏముందని జగన్ అన్నారు.

సిఎఁకు ఎక్కడం లేదు
ఎన్నిసార్లు ఏం చేసినా చర్మం మందంగా ఉండే ముఖ్యమంత్రికి ఏమీ ఎక్కటం లేదని వ్యాఖ్యానించారు. కాగా, తాము అంశాల వారీగా మద్దతు ఇస్తామని, భూసేకరణలో బహుళ పంటల భూములు తీసుకోవటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.

దానికి వ్యతిరేకమే..
పార్లమెంటులో కూడా బహుళ పంటల భూముల్ని సేకరించటంపై వ్యతిరేకిస్తామని, బీమా తదితర బిల్లులకు ప్రభుత్వానికి సహకరిస్తామని వైయస్ జగన్ మీడియాతో చెప్పారు.












Click it and Unblock the Notifications