జీవో నంబర్ 1 పై ఏపీ హైకోర్టులో పిల్ - కీలక పరిణామాలు- బెంచ్ హంటింగ్ ఆరోపణ..
ఏపీలో రహదారులపై ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలు నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు పర్యటనల్ని అడ్డుకునేందుకే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందని విమర్శిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఇవేవీ లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైంది.
ఏపీ ప్రభుత్వం కందుకూరు, గుంటూరు తొక్కిసలాట నేపథ్యంలో తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీంతో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పిల్‌పై మాకు ఎలాంటి సమాచారం లేదని ఏజీ శ్రీరాం కోర్టుకు తెలిపారు. అలాగే నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదన్నారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం తీసుకొన్న విధానాల పరమైన నిర్ణయాలపై దాఖలయ్యే ప్రజా ప్రయోజన వాజ్యాలను ప్రస్తుతం సంక్రాంతి సెలవుల్లో పనిచేస్తున్న వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం లేదని అడ్వకేట్ జనరల్ తెలిపారు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాలకు సంబంధించిన కేసులను విచారించకూడదన్నారు. అంతే కాదు ఒక రాజకీయ పార్టీ బెంచ్ హంటింగ్ ( జడ్జిలను ఎంపిక చేసుకోవడం)లో భాగంగా దీన్ని ఉపయోగించుకుంటోందని ఏజీ శ్రీరాం ఆరోపించారు. దీంతో ఈ పిల్ పై విచారణ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications