హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరైనా కేంద్రానికి ఆదేశాలివ్వాలి: కోర్టుకెక్కిన 'హోదా' ఫైట్, హైకోర్టులో పిల్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ఏపీలో ఇప్పటిదాకా జరిగిన పోరాటమంతా రాజకీయంగా జరిగినదే. రెండు ప్రధాన పార్టీలు రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా.. ప్రజా సంఘాలు వారికి మద్దతుగా పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థ ద్వారా కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచితే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరిగినప్పటికీ అంత బలంగా జరగలేదనే చెప్పాలి.

బాబు ఆ పని ఎందుకు చేయట్లేదు!: లొసుగులపై భయమా?, అంతా ఎన్నికల కుతంత్రమేనా? <br>బాబు ఆ పని ఎందుకు చేయట్లేదు!: లొసుగులపై భయమా?, అంతా ఎన్నికల కుతంత్రమేనా?

గతంలో హీరో శివాజీ హోదాపై హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన పి.శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామిలను నెరవేర్చాల్సిందిగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిల్ ద్వారా ఆయన హైకోర్టును కోరారు.

PIL moved in Hyderabad High Court on special status to Andhra Pradesh

ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 6,90,92,93ల అమలుకు కేంద్రానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వీటి అమలుకు హామి ఇచ్చారని గుర్తుచేశారు.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా హామిల అమలుకు బాధ్యత వహించాలని కోరారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామిలను నెరవేర్చడానికి ఇప్పటి ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదని పిల్ లో పేర్కొన్నారు.

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తుచేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల హామిలను నెరవేర్చడంలో విఫలమవుతున్నా.. ఎన్నికల కమిషన్ మాత్రం దీనిపై మాట మాట్లాడటం లేదని ఆరోపించారు.

కొన్ని పార్టీల ఆందోళన కారణంగా.. లోక్‌సభ, రాజ్యసభల్లో ఎలాంటి బిజినెస్‌కు అవకాశం లేకుండా పోయిందని, ఈ పరిస్థితికి కారణమైన సభ్యులకు వేతనాలు నిలిపివేయాలని పిటిషనర్ కోరడం గమనార్హం.

English summary
A public interest litigation (PIL) has been moved before the Hyderabad High Court seeking a direction to the Central government to accord the Special Category Status to Andhra Pradesh and implement the Andhra Pradesh Reorganisation Act, 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X