వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటి కాలితో సైకిల్: విశాఖ తీరంలో గులాబీ గుబాళింపు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: సాగర తీరం ఆదివారం ఉదయం గులాబీ రంగు పులుముకుంది. పింక్ అక్షరాలతో కూడిన టి షర్ట్‌లు ధరించిన యువత పరుగు తీసి.. ఆరోగ్యం పైన ప్రజలకు అవగాహన కల్పించింది.

రొమ్ము క్యాన్సర్ నివారణ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఎరీనా ఈవెంట్స్ అండ్ యూనైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ వ్యవహరించారు. వైజాగ్ గోయింగ్ పింక్ రన్ పేరుతో హాఫ్ మారథాన్ పరుగును మంత్రి గంటా శ్రీనివాస రావు జెండా ఊపి ప్రారంభించారు.

పింక్ రన్

పింక్ రన్

సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మంత్రి గంటా అన్నారు. నిత్యం యోగా, నడక వంటి కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

పింక్ రన్

పింక్ రన్

హాఫ్‌ మారథాన్‌లో 21 కిమీ, 10 కిమీ, 5 కిమీ, 3 కిమీ పరుగు నిర్వహించారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు.

పింక్ రన్

పింక్ రన్

21 కిలో మీటర్ల పరుగు వైఎంసీఏ నుంచి తెన్నేటి పార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం వరకు వెళ్లి, తిరిగి వైఎంసీఏకు చేరుకుంది.

పింక్ రన్

పింక్ రన్

21 కిలో మీటర్ల పరుగులో డాక్టర్‌ పి మాధురి, చందన, మ్యాడి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు.

పింక్ రన్

పింక్ రన్

10 కిలో మీటర్ల పరుగు వైఎంసీఏ నుంచి తెన్నేటి పార్కు వరకు, తిరిగి వైఎంసీఏ చేరుకుంది. ఈ పోటీలో యాక్యోగాధ (జపాన్‌), నటాషా, శ్రుతి వరుసగా ప్రథం, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.

పింక్ రన్

పింక్ రన్

5కే రన్‌ వైఎంసీఏ నుంచి ఎంవీపీ కాలనీ డబుల్‌ రోడ్డుకు, తిరిగి వైఎంసీఏ వరకు నిర్వహించారు. ఈ పోటీల్లో ఐశ్వర్య, సంజున, సీతాల్‌ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.

పింక్ రన్

పింక్ రన్

మూడు కిలోమీటర్ల పరుగు వైఎంసీఏ నుంచి పెదజాలరిపేట కూడలికి, తిరిగి వైఎంసీఏ వరకు నిర్వహించారు. సాయి అనిత, సాయిస్వాతి, శిరీష వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

పింక్ రన్

పింక్ రన్

10కే పింక్‌ పరుగులో కృత్రిమ అవయవంతో హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా పరిగెడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పింక్ రన్

పింక్ రన్

మరో వికలాంగుడు హైదరాబాద్‌కు చెందిన కిరణ్ కనుజియా ఒంటికాలితో సైకిల్‌ తొక్కుతూ ఆకట్టుకున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అమిత్‌గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Photos of Pink run in Vishaka on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X