కెసిఆర్ ఫాస్ట్‌ను సవాల్ చేస్తూ పితాని పిటిషన్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించిన 'ఫాస్ట్' పథకానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయిబర్స్‌మెంట్‌పై జారీ చేసిన జీవో వివాదస్పాద కావడంతో దానిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

ఈ పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరమవుతుందని, హైదరాబాద్‌లో ఏపీ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నారని, వారందరికీ కాదని ఒక్క తెలంగాణ విద్యార్థులకే ఫీ రియింబర్స్‌మెంట్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు పిటిషనర్ అర్హతను ప్రశ్నించింది. దానికి పితాని తరఫు న్యాయవాది.. విద్యార్థుల జీవితాల దృష్టా పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Pitani challenges KCR's FAST

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించింది. విద్యార్థుల స్థానికతను 1956 నవంబర్ 1వ తేదీని కొలమానంగా తీసుకని నిర్ణయించి, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని చెబుతూ ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తెచ్చింది.

అయితే, తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. స్థానికతకు 1956ను కొలమానంగా తీసుకోవడాన్ని కూడా వ్యతిరేకిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+