వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీల్డ్‌కవర్: కిరణ్‌‍కు మద్దతుగా రాహుల్‌ని లాగిన పితాని!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pitani drags Rahul to support Kiran Kumar Reddy
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డిని సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అన్ని తెలంగాణ నేతలకు కౌంటర్‌గా మంత్రి పితాని సత్యనారాయణ ఏఐసిసి ఉపాధ్యాక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మాట్లాడారు. కిరణ్‌ను సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అంటున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు, మంత్రులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్ణయాన్ని రాహుల్ గాంధీయే తప్పుపట్టగా లేనిది సిడబ్ల్యూసి నిర్ణయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తే తప్పేమిటన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, మంత్రులను సీల్డ్ కవర్‌లో ఎన్నుకోవడం అధిష్టానం సంప్రదాయమని, ఆ విషయం తెలియకుండా కిరణ్‌ను కించపర్చడమేమిటన్నారు.

తెలంగాణ నేతల విమర్శల్లో వాస్తవం లేదన్నారు. మంత్రులే కిరణ్‌ను అలా అనడం బాధించిందన్నారు. రాష్ట్రం ఎప్పటికీ సమస్యగానే ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన జరగదన్నారు. సీమాంధ్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఛాంపియన్ అన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు కేంద్రం విలువ ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు.

కిరణ్ సమైక్యవాది కాదన్న దాడి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది కాదని, ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్‌లో డ్రామాలు ఆడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దాడి వీరభద్ర రావు వేరుగా మండిపడ్డారు. ప్రభుత్వం పడిపోకుండా కాపాడేందుకే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించలేదన్నారు.

English summary
Minister Pitani Satyanarayana on Sunday condemned Telangana leaders comments on CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X