పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్.. ఆనందంగా ఉందంటూ..
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పరిధిలోని శాఖల్లో సంస్కరణలపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు తనకు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం కల్పించిన పిఠాపురం నియోజకవర్గంపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ సమస్యలను తెలుసుకుంటూ తగు పరిష్కారాలను సూచిస్తున్నారు.
ఈ క్రమంలోనే పిఠాపురం అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఎక్స్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

"పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు - రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి.. పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది.
పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు – రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 26, 2025
పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను.…
ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట- ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి.. ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టడమైనది.
ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసి అండగా నిలిచిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ @nitin_gadkari గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
@ncbn గారికి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications