జగన్ విమర్శలకు వర్మ ఘాటు కౌంటర్- లక్షల మందిని చంపాలనుకున్నావ్..!

ఏపీలో ఇవాళ ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పిఠాపురం టీడీపీ నేత వర్మ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఏలేరు వరదల గురించి ముందే తెలిసినా ప్రభుత్వం బాధితుల్ని అప్రమత్తం చేయలేదని, ఇది మరో మానవ తప్పిదం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై వర్మ మండిపడ్డారు. విజయవాడ వరదల విషయంలో జగన్ చేసిందేంటని ఆయన ప్రశ్నించారు.

కృష్ణానదిలో బోట్లు వదిలి లక్షలాదిమందిని చంపాలని చూశారని వైసీపీ అధినేత జగన్ పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు ఏలేరులో పర్యటించిన జగన్..కూటమి సర్కార్ పై విమర్శలు చేసిన నేపథ్యంలో వర్మ ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన ఉత్తరాన్ని జగన్ చదివారని ఎద్దేవా చేసిన వర్మ, కాంట్రాక్టర్లను బెదిరించి రివర్స్ టెండరింగ్ చేశారని ఆరోపించారు. ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వర్మ ఆరోపించారు. ఏలేరులో జగన్ ఆటలు సాగనివ్వబోమని వర్మ హెచ్చరించారు.

pithapuram tdp leader varma counter to ys jagan s remarks on nda government

ఏలేరు వరద ప్రాంతాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా పర్యటించి వెళ్లారు. అక్కడ వరదలకు ఏలేరు రిజర్వాయర్ లో నీటిని ఎక్కువగా నిల్వ చేయడమే అని జగన్ విమర్శలు గుప్పించారు. దీంతో కూటమి సర్కార్ లో పార్టీలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఏలేరు వరదలకు చంద్రబాబే కారణమన్న వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నాయి. ఇదే క్రమంలో వర్మ కూడా తనదైన శైలిలో జగన్ పై విమర్శలు గుప్పించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+