వేసవిలో ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచినీళ్లు తాగుతున్నారా?
వేసవికాలం వచ్చేసింది. రోహిణీ కార్తె రాకుండానే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్యలో ప్రజలు బయటకు రావడం కూడా తగ్గించారు. దాహార్తి తీర్చుకోవడానికి చాలామంది పదే పదే మంచినీళ్లు తాగుతుంటారు. అయితే వారు తాగే నీరంతా ప్లాస్టిక్ బాటిల్స్ లోవే అవుతున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగితే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
ప్లాస్టిక్ మంచినీళ్ల సీసాలపై ఎండ పడితే అవి మైక్రోప్లాస్టిక్ ను విడుదల చేస్తాయి. దీనివల్ల ఆ నీరు తాగినప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాదు కాలేయం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ బాటిల్స్ ను ఎండలో ఉంచితే డయాక్సిన్ లాంటి విషపదార్ధాలు నీటిలో కలుస్తాయి. ఆ నీరు తాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యక్తి రోగ నిరోధక శక్తి కూడా తగ్గే ప్రమాదముంది. సాధ్యమైనంతవరకు పురుషులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని, దీనివల్ల సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడతాయని చెబుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ను రీ యూజ్ చేసి వాడడం మంచిది కాదు. బయట నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి తాగడం అనారోగ్యానికి దారి తీస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ లేదంటే మెటల్ బాటిల్స్ వాడటంవల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications