హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ప్లేబాయ్ క్లబ్: హిందూ సంస్థల నిరసన

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్లేబాయ్ పత్రికా యాజమాన్యం నేతృత్వంలో ప్లేబాయ్ క్లబ్ హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతోంది. హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్‌ను ఏర్పాటు చేయడానికి మూడేళ్లుగా కాలిఫోర్నియాకు చెందిన ప్లేబాయ్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. 9వ తేదీ రాత్రి నోవాటెల్ కనె్వన్షన్ సెంటర్‌లో ఈ క్లబ్‌ను స్వీడన్‌కు చెందిన సెబ్‌జాక్ , డిజె అనీస్‌లు ప్రారంభిస్తారు.

ప్లేబాయ్ సంస్థప్రపంచ వ్యాప్తంగా 40 క్లబ్‌లను నిర్వహిస్తోంది. ఈ క్లబ్‌కు హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వడంపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ప్లేబాయ్ క్లబ్‌లో ప్లేబాయ్ కాఫీ, ప్లేబాయ్ ఫేషన్ బార్, క్లబ్‌లు నడుస్తాయి. బన్సీ సూట్లు, సెక్సీ వెయిట్రస్‌లు, నగ్న సహాయకులకు ఈ క్లబ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

ప్లేబాయ్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ తరఫున భారతీయ ప్రతినిధి 30 ఏళ్ల కాంట్రాక్టును పొందారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థ 120 క్లబ్‌లను హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే భారత్‌లో మాత్రం తాము న్యూడిటీ అటెండెంట్లను (నగ్న సహాయకులు) ఉపయోగించుకోవడం లేదని సిఇఓ సంజయ్ గుప్త చెబుతున్నారు.

Play Boy club will be opened in Hyderabad

భారతీయ సంప్రదాయం పరిగణనలోకి తీసుకునే తాము క్లబ్‌ను నిర్వహించబోతున్నామని ప్రతినిధులు చెబుతున్నారు. ప్లేబాయ్ క్లబ్‌కు సంబంధించి ఉన్న అనుమానాలను శుక్రవారం నాడు నివృత్తి చేస్తామని స్థానిక ప్రతినిధి సిమ్మికెంట్ చెప్పారు. క్లబ్ నిర్వహణ అందరూ భావిస్తున్నట్టు అశ్లీలానికి కేరాఫ్‌గా కాకుండా స్థానికులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆమె చెబుతున్నారు. ఈ వ్యవహారాలపై వివరించేందుకు ముంబై నుండి పరాగ్ సంగ్వీ శుక్రవారం నాడు నగరానికి వస్తున్నారు.

2012లోనే గోవాలో తొలి క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ గట్టి ప్రయత్నం చేసింది అయితే పెద్ద ఎత్తున గొడవ జరగడంతో క్లబ్ ఏర్పాటు వెనక్కు మళ్లింది. న్యూడిటీ ఉండదని చెప్పినా గోవా ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదు. దాంతో తమ సంస్థ పేరును మార్చుకుని సన్‌షైన్ రిసార్టు పేరిట 22వేల చదరపు అడుగుల స్థలంలో ప్లేబాయ్ తన క్లబ్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోనూ ఇదే తరహా ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న ప్లేబాయ్ సంస్థ హైదరాబాద్‌పై కన్ను వేసింది.

హిందూ సంస్థల నిరసన

ప్లేబాయ్ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హిందూ జన జాగృతి సమితి హెచ్చరించింది. సమితి కన్వీనర్ మోహన్ గౌడ ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. ప్రభుత్వం ఆ సంస్థకు ఇచ్చిన అనుమతిని నిరాకరించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్న తరుణంలో ఇలాంటి క్లబ్‌లను ఏర్పాటు చేయడం చాలా దారుణమని ఆయన చెప్పారు.

English summary
Play Boy management has prepared to set up its club in Hyderabad. Hindu organisations are protesting against it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X