రామోజీ డాల్ఫిన్ హోటల్లో పేకాట: 8 మంది అరెస్టు
విశాఖపట్నం: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్లో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకున్నట్లు నగర టాస్క్‌ఫోర్స్ సిఐ ఇలియాస్ అహ్మద్ తెలిపినట్లు సాక్షి మీడియా రాసింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారమంటూ వార్తాకథనాన్ని ప్రచురించింది.
డాల్ఫిన్ హోటల్లో చాలా రోజులుగా పేకాట స్థావరం నడుపుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు నగరంలోని ఓ పెద్ద హోటల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం కొద్ది రోజుల క్రితమే టాస్క్‌ఫోర్స్‌కు చేరింది. అయితే ఏ హోటల్ అనేది నిర్ధారణ కాలేదు.

మంగళవారం మధ్యాహ్నం విశ్వసనీయమైన సమాచారం అందడంతో సిఐ ఇలియాస్ అహ్మద్ తన బృందంతో సాయంత్రం డాల్ఫిన్ హోటల్‌కు చేరుకున్నారు. బయట వేచి ఉండి లోపల ఏ గదిలో పేకాట ఆడుతున్నారో ఇన్‌ఫార్మర్ ద్వారా నిర్ధారించుకున్నారు.
సమాచారం నిజమేనని తేలడంతో వెంటనే హోటల్‌పై దాడి చేశారు. రూమ్ నెంబర్ 605లో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.51,600 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందినవారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications