గన్నవరం చేరుకున్న ప్రధాని మోడీ-ఘనస్వాగతం..! అమరావతికి పయనం..

ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రత్యేక వాయుసేన విమానంలో చేరుకున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలువురు నేతలు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్లో ఆయన అమరావతి సభా వేదిక వద్దకు బయలుదేరి వెళ్లారు.

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.మధ్యాహ్నం 02:50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు.

pm modi arrived at Vijayawada international airport to attend Amaravati restart event

రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్యసేవలు శాఖ, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ సీఎం రమేష్, బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి, రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కొణిదల నాగబాబు మోడీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

అమరాతిలో ఇవాళ ప్రధాని మోడీ రాజధాని పునఃప్రారంభ పనులు మొదలుపెట్టనున్నారు. పైలాన్ ఆవిష్కరణతో పాటు దాదాపు 50 వేల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని మోడీ ప్రారంభిస్తారు. ఇందులో కొన్నివర్చువల్ గా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 5 లక్షల మంది జనసమీకరణతో పాటు భారీగా ఏర్పాట్లు కూడా చేసింది. ఈ సభ ద్వారా అమరావతి పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+