• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ- సీఎం జగన్ మధ్యలో రఘురామ : మారుతున్న సమీకరణాలు - ఏం జరుగుతోంది..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ రఘురామ రాజు - సీఎం జగన్ కలవబోతున్నారా. ప్రధాని సమక్షంలో ఈ ఆసక్తి కర పరిణామం చోటు చేసుకోనుందా. ఇప్పుడు వైసీపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన రఘురామ రాజు..ఆ తరువాత కొంత కాలానికే వైసీపీ అధినాయకత్వంతో విభేదించారు. అప్పటి నుంచి ఆయన ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పైన విరుచుకుపడుతున్నారు. మధ్యలో గత ఏడాది రఘురామ జన్మదినం నాడు రాజద్రోహం కేసులో ఏపీ సీఐడి అరెస్ట్.. సుప్రీం బెయిల్ తో బయటకు రావటం దాకా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

వైసీపీ వర్సెస్ రఘురామ

వైసీపీ వర్సెస్ రఘురామ

మరోవైపు.. రఘరామ పైన అనర్హత వేటువేయాలంటూ వైసీపీ నేతలు పలు మార్లు స్పీకర్ ను కలిసారు. తన పైన చేతనైతే అనర్హత వేగు వేయించాలని రఘురామ గతంలోనే సవాల్ చేసారు. ఇప్పటికి ప్రివిలేజ్ కమిటీ పరిధిలో ఈ విషయం ఉంది. అయితే, రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభలో సైతం చంద్రబాబు ను రఘురామ మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలతో ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయిన రఘురామ మధ్యలో మరోసారి హైదరాబాద్ కు రాగా...ఆయనకు సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.

ఢిల్లీ నుంచే టార్గెట్ సీఎం జగన్

ఢిల్లీ నుంచే టార్గెట్ సీఎం జగన్

తన సొంత నియోజకవర్గంలో సంక్రాతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చేందుకు రక్షణ కోరారు. ఇక, వచ్చే నెల 4వ తేదీన ప్రధాని భీమవరం పర్యటన ఖరారైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామ రాజు 125వ జన్మదినం కావటంతో ఆ రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సీఎం జగన్ సైతం హాజరు కానున్నారు. అయితే, స్థానిక ఎంపీగా రఘురామ సైతం ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం రావాల్సి ఉంది. ప్రోటోకాల్ లో భాగంగా ఆయనకు ఆహ్వానం పంపాల్సిన అసవరం ఉంటుంది. కానీ, రఘురామ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రధాని పర్యటన..ఆసక్తి కర రాజకీయం

ప్రధాని పర్యటన..ఆసక్తి కర రాజకీయం

తన పార్లమెంటరీ పరిధిలోని కార్యక్రమం కావటం..అందునా ప్రధానితో మంచి సంబంధాలు ఉండటంతో హాజరయ్యే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే..చాలా కాలం తరువాత ఒకే వేదిక పైన సీఎం జగన్...ఎంపీ రఘురామ మధ్యలో ప్రధాని అన్నట్లుగా కార్యక్రమం కొనసాగనుంది.

కొద్ది రోజులుగా వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి...రఘురామ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. రఘురామ సైతం సవాళ్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని పర్యటన వేళ..భీమవరం పర్యటనలో ఎటువంటి ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటుందనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ లో కనిపిస్తోంది.

English summary
Hot debate is running in political circles whether rebel MP Raghurama raju will attend PM Modis program in his Parliamentary constituency in Bhimavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X