AP Polling: రికార్డు సృష్టించాలని మోడీ పిలుపు-ఎవరికో ఓటేయాలో చెప్పిన షా..!
ఏపీలో ఇవాళ ఉదయం ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి రెండు గంటల్లోనే దాదాపు 10 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే జోరు కొనసాగితే సాయంత్రానికి రికార్డు స్దాయిలో పోలింగ్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి రికార్డు స్థాయి పోలింగ్ నమోదు చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చి పోలింగ్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న వారు పోలింగ్ బూత్ లకు తప్పనిసరిగా రావాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయన్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న నాలుగోదశ పోలింగ్ లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలిరావాలని మోడీ కోరారు.

మరోవైపు ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుభాష, సంస్కృతిని పరిరక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్ప్రరిపాలన నుంచి విముక్తి చేయాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లను ఆయన కోరారు. తద్వారా ఎవరికి ఓటేయాలో పరోక్షంగా చెప్పేశారు.












Click it and Unblock the Notifications