వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో టీ - జగన్‌తో లంచ్: మోడీ గేమ్ ప్లాన్‌లో ఇద్దరూ ఫిక్స్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ముగిసిన రెండు కార్యక్రమాలు- ఏపీ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ది పాయింట్‌గా మారాయి. ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరయ్యారు. ప్రధానిని వేర్వేరుగా కలిశారు. ఇది కాస్తా ఏపీ రాజకీయాల్లో హాట్ డిబేట్‌గా మారింది.

చంద్రబాబు ములాఖత్ వేళ..ప్రధాని ఓదార్పు ఫొటోలు: పవన్ పరోక్ష సందేశంచంద్రబాబు ములాఖత్ వేళ..ప్రధాని ఓదార్పు ఫొటోలు: పవన్ పరోక్ష సందేశం

 చంద్రబాబు సహా..

చంద్రబాబు సహా..

ఈ రెండు కార్యక్రమాలకూ దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నాయకులు తిరుచ్చి శివ సహా వేర్వేరు పార్టీల నాయకులు హాజరయ్యారు. వారందరినీ మోడీ ఆప్యాయంగా పలకరించారు.

 లంచ్‌లో..

లంచ్‌లో..

నీతి ఆయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్ పాల్గొన్న ముఖ్యమంత్రులు, లెప్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ముగిసిన తరువాత వారకి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు అస్సాం, రాజస్థాన్ ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, అశోక్ గెహ్లాట్‌, జమ్మూ కాశ్మీర్, లఢక్ లెప్టినెంట్ గవర్నర్లు మనోజ్ సిన్హా, రాధాకృష్ణ మాథుర్‌ కూర్చున్న టేబుల్ వద్ద మోడీ చాలా సేపు గడపడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

 అక్కడే మోడీ భోజనం

అక్కడే మోడీ భోజనం

ఈ అయిదుమంది ఉన్న టేబుల్ వద్దే మోడీ తన భోజనాన్ని తెప్పించుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. సుమారు గంటపాటు ఈ లంచ్ మీటింగ్ కొనసాగింది. ఒంటిగంటకు మొదలైన భేటీ 2 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా వారి మధ్య రాజకీయాల గురించి పెద్దగా ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. బీజేపీకి చెందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న అశోక్ గెహ్లాట్ మధ్య కొంత రాజకీయపరమైన వాడివేడి సంభాషణ కొనసాగినప్పటికీ.. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరూ ఇష్టపడలేదని చెబుతున్నారు.

 రాజకీయాల గురించి మాట్లాడని వైఎస్ జగన్..

రాజకీయాల గురించి మాట్లాడని వైఎస్ జగన్..

వైఎస్ జగన్ మాత్రం రాజకీయాల గురించి ప్రస్తావించలేదని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలను అంతకుముందే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో బహిరంగంగా, అందరి మధ్యా ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్ జగన్ మరోసారి కుండబద్దలు కొట్టారని అంటున్నారు. 2024 ఎన్నికలు వారి మధ్య చర్చకు వచ్చినప్పటికీ.. దాని మీద మాట్లాడటానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది

English summary
PM Narendra Modi dinner with Chief Ministers and lieutenant governors including AP CM YS Jagan Mohan Reddy during the Niti Aayog governing council meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X