విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీతో పొత్తుపై తేల్చేసిన ప్రధాని-వైసీపీ పాలనపైనా..పార్టీ నేతలకు రూట్ మ్యాప్ ఫిక్స్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పైన ప్రధాని ఫోకస్ పెట్టారు. పార్టీ అంచనాలు..భవిష్యత్ వ్యూహాల పైన రెండు రాష్ట్రాల నేతలకు స్పష్టం చేసారు. ప్రధాని మోదీ తన నివాసంలో కర్ణాటక..తెలంగాణ..ఏపీకి చెందిన పార్టీ ఎంపీలకు అల్పాహార విందు నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్రాల వారీగా పరిస్థితుల పైన ఆరా తీసినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మూడు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.

ప్రధానితో తెలుగు రాష్ట్రాల నేతల భేటీ

ప్రధానితో తెలుగు రాష్ట్రాల నేతల భేటీ

ఉత్తరాది రాష్ట్రాల్లో తమదైన ముద్ర వేసుకున్న బీజేపీని దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలోపేతం చేసేందుకు కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకోవాలన్న దానిపై ఎంపీలకు పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. తెలంగాణలో ప్రతిపక్షం కాంగ్రెస్, ఏపీలో ప్రతిపక్షం టీడీపీ క్షేత్రస్థాయిలో పట్టును కోల్పోతున్న పరిస్థితుల్లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాల్లోనూ అవకాశాలు ఉన్నాయి

రెండు రాష్ట్రాల్లోనూ అవకాశాలు ఉన్నాయి

ఈ అవకాశాన్ని ఏవిధంగా అందిపుచ్చుకోవాలన్న దానిపై చర్చించారు. ఇందు కేంద్ర ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతం లో భాగంగా.. నియోజకవర్గ స్థాయి నుంచి కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఈ నెల 28న విజయవాడలో ఏపీ బీజేపీ భారీ బహిరంగ సభకు నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ..ఈ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

విజయవాడ సభ ద్వారా ముందుకు

విజయవాడ సభ ద్వారా ముందుకు


ఈ సభకు కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నారు. ఇక, తెలంగాణలోనూ దూకుడుగా వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం డిసైడ్ అయింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత తెలంగాణలో పార్టీ పరంగా చేయాల్సిన మార్పులు.. పదవులపైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక, తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయ పరిస్థితులు మారాయనేది పార్టీ నేతల అంచనా. ఏపీలో వైసీపీతో పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు.

Recommended Video

Konijeti Roasaih : The Ajatshatru In Indian Politics | End Of An Era || Oneindia Telugu
ఏపీలో బీజేపీ..తెలంగాణ కాంగ్రెస్ స్థానాల భర్తీ

ఏపీలో బీజేపీ..తెలంగాణ కాంగ్రెస్ స్థానాల భర్తీ

టీడీపీతో పొత్తు పైన భిన్న రకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. ప్రధానితో సమావేశం తరువాత మాత్రం టీడీపీతో సంబంధాలు ఉండవనే క్లారిటీ వచ్చినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని ఇదే సమావేశంలో వారణాశి లో కొత్తగా చేపట్టిన డెవలప్ మెంట్.. అక్కడ తన పర్యటన విశేషాలను పార్టీ ఎంపీలతో పంచుకున్నారు. పార్టీ ఎంపీలు సైతం వారణాశి పర్యటించాలని..అదే విధంగా.. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు అక్కడకు వెళ్లి చూసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశం ద్వారా 2024 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ..బీజేపీ తన శక్తి చాటుకొనే క్రమంలో భాగంగా అడుగులు వేస్తున్నట్లుగా పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు.

English summary
PM Modi gives directions for AP and telangana BJP Leaders on future political action plan to strengthen the party for coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X