అనుభవంతో చెప్తున్నా..చంద్రబాబు వల్లే సాధ్యం.. మోడీ కితాబు..!
ఏపీ కలల రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. అమరావతి రాజధాని నిర్మాణం చేయాల్సిన చంద్రబాబు గుర్తించి, ఆయన అనుభవం గురించి ప్రధాని మోడీ గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తుచేశారు. అప్పుడు తాను గుజరాత్ సీఎంగా ఉంటే, చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారని ప్రధాని మోడీ తెలిపారు.
తాను గుజరాత్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ రంగం కోసం తీసుకున్న చర్యల్ని అధ్యయనం చేసే వాడినని ప్రధాని మోడీ ఇవాళ అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వాటిని తాను ఇప్పుడు ఇక్కడ అమల్లో పెడుతున్నట్లు తెలిపారు. నా అనుభవంతో చెబుతున్నా.. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం అయినా, పెద్ద ప్రాజెక్టుల్ని నాణ్యంగా చేయాలంటే చంద్రబాబుతోనే అవుతుందని మోడీ ప్రశంసించారు.

గతంలో 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి తాను శంఖుస్ధాపన చేశానని ప్రధాని మోడీ తెలిపారు. గత పదేళ్లుగా అన్ని విధాలా సహకారం అందించామని, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ, హైకోర్టు వంటి నిర్మాణాలకు కూడా కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ వికసిత ఆంధ్రప్రదేశ్ కల కన్నారని, తాము ఇప్పుడు దాన్ని సాకారం చేయాల్సి ఉందన్నారు. ఇది మనం చేయాలి, మనమే చేయాలి బ్రదర్ పవన్ కళ్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications