జీఎస్టీ 2.0పై ప్రచారం భేష్-వికసిత్ భారత్ కేంద్రంగా ఏపీ-కర్నూల్లో మోడీ..!

కర్నూలులో ఇవాళ నిర్వహించిన సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ద్వాదశజ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ సోమనాధ్ ఆలయం ఉందని, తాను అక్కడే పుట్టానని మోడీ గుర్తుచేసుకున్నారు. రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నానని తెలిపారు. ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించి ఆయనకు అల్లమ్మ ప్రభు, అక్కమహాదేవి లాంటి శివభక్తులకు ప్రణామాలు తెలిపినట్లు వెల్లడించారు.

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి లాంటి ధీరులకు ప్రధాని వినమ్రపూర్వక నమస్కారాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్రసాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమని, యువత ఎంతో చైతన్యవంతులని ప్రధాని తెలిపారు. ఏపీలో విజన్ ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారని మోడీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. గత 16 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీలో ప్రగతి వేగంగా జరుగుతోందన్నారు. ఢిల్లీ, అమరావతిలు రెండూ వేగంగా అభివృద్ది దిశగా వెళ్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తైన 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ గా తయారవుతుందన్నారు.

PM Modi Praises GST 2 0 Campaign in Kurnool Declares AP a Viksit Bharat Center

21వ శతాబ్దం భారత దేశానిదని, 140 కోట్ల మంది భారతీయులది అవుతుందని మోడీ తెలిపారు. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో కనెక్టివిటి బలోపేతం కావటంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులతో కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దేశానికైనా, రాష్ట్రానికైనా ఇంధన భద్రత అవసరమన్నారు. ప్రస్తుతం 3 వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించామని, తద్వారా దేశ ఇంధన సామర్ధ్యం పెరుగుతుందన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయని, తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే తక్కువే ఉందని, చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. 1400 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు దేశంలో ఉందని, తగినంత విద్యుత్ దేశ ప్రజలకు లభ్యం అవుతోందని తెలిపారు.

PM Modi Praises GST 2 0 Campaign in Kurnool Declares AP a Viksit Bharat Center

శ్రీకాకుళం నుంచి ఆంగుల్ వరకూ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేశామని తెలిపారు. దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఓ కీలక ప్రాంతంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ది దిశగా నడుస్తోందన్నారు. 20 వేల సిలిండర్ల సామర్ధ్యంతో ఇండేన్ బాటిలింగ్ ప్లాంట్‌ను చిత్తూరులో ప్రారంభించామన్నారు.

మల్టీమోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతున్నట్లు తెలిపారు. సబ్బవరం నుంచి షీలా నగర్ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగిందన్నారు. రైల్వే రంగంలో కొత్త యుగం ప్రారంభమైందని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామన్నారు.

వికసిత్ భారత్ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ వేగాన్ని మరింతగా పెంచుతుందన్నారు. భారత్ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించిందన్నారు. దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ చెప్పారన్నారు.డేటా సెంటర్,ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయన్నారు.

ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్ సీ కేబుల్ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుందన్నారు. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచానికి సేవలందింస్తుందన్నారు. సీఎం చంద్రబాబు విజన్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం ఏపీ అభవృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి అంతే అవసమన్నారు. కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయని, పారిశ్రామిక అభివృద్ది వేగంగా జరుగుతుందని తెలిపారు. ఏపీ వేగవంతమైన అభివృద్ధి కోసం కొప్పర్తి -ఒర్వకల్ పారిశ్రామిక నోడ్ల ద్వారా పచ్చే పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 21వ శతాబ్దపు మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా ప్రపంచ దేశాలు భారత్ ను చూస్తున్నాయన్నారు. భారత్ లో ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోందని, ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ కీలకంగా మారిందని గుర్తుచేశారు.

PM Modi Praises GST 2 0 Campaign in Kurnool Declares AP a Viksit Bharat Center

కృష్ణా జిల్లా నిమ్మకూరులో రక్షణ రంగానికి చెందిన నైట్ విజన్ గాగుల్స్, క్షిపణుల సెన్సార్లు, డ్రోన్ గార్డులను తయారు చేస్తున్నామని,ఇది రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులను కూడా చేసేందుకు ఆస్కారం ఇస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ లో దేశంలో తయారైన ఉత్పత్తుల బలం ఏమిటో చూశామన్నారు.కర్నూలులో భారత్ డ్రోన్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ నిర్ణయించటం సంతోషదాయకమన్నారు.ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్ల పనితీరు ఏమిటో తెలియచెప్పిందన్నారు. నవరాత్రి ముందు జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చామని, ప్రజలపై పన్నుల భారం తొలగించామని తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయమన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ఏపీ ప్రజలు రూ.8 వేల కోట్ల మేర ప్రజలకు ఆదా అవటం సంతోషదాయకమన్నారు. కానీ ఆ ప్రయోజనాలు అందరికీ అందాల్సి ఉంది... అప్పుడే అది సఫలమైనట్టన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+