అమరావతి పనుల్ని పునఃప్రారంభించిన మోడీ-రాజధాని, పోలవరానికి సహకరిస్తామని హామీ..!

అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పునఃప్రారంభించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ సభలో ఆయన వర్చువల్ గా 18 ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశారు. ఇందులో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అమరావతి రాజధాని పనులు సహా మొత్తం 58 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ఇవాళ శంఖుస్థాపన చేశారు. ఇందులో 49 వేల కోట్లు రాజధాని అమరావతి పనులకే కేటాయించారు. మరో 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులూ ఉన్నాయి.

pm modi relaunched Amaravati capital works in ap assures support from centre

తల్లి దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిపై మిమల్ని కలవడం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ తన ప్రసంగం ప్రారంభించారు. అమరావతి పుణ్యభూమిపై నిలబడిన తనకు కేవలం ఒక నగరం కనిపించడం లేదని, ఓ స్వప్నం సాకారమవుతున్నట్లు కనిపిస్తుందన్నారు. ఓ కొత్త అమరావతి, ఓ కొత్త ఏపీ తనకు కనిపిస్తోందన్నారు. అమరావతి కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదని, భారత ఆశల సౌధం కూడా అని మోడీ తెలిపారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మోడీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇంద్రలోకపు రాజధాని పేరు అమరావతి అని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అమరావతేనన్నారు. ఇది కాకతాళీయం మాత్రమే కాదు స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఆరంభం అన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఒక శక్తి అని, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ యువకుడి కలల సాకారం చేసే నగరం అవుతుందన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ వంటివి ఇందులో ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో అమరావతి నాయకత్వం వహిస్తుందన్నారు. వీటిిని పూర్తి చేయడంలో కేంద్రం రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

తాను గుజరాత్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ రంగం కోసం తీసుకున్న చర్యల్ని అధ్యయనం చేసే వాడినని మోడీ తెలిపారు. వాటిని తాను ఇప్పుడు ఇక్కడ అమల్లో పెడుతున్నట్లు తెలిపారు. నా అనుభవంతో చెబుతున్నా.. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం అయినా, పెద్ద ప్రాజెక్టుల్ని నాణ్యంగా చేయాలంటే చంద్రబాబుతోనే అవుతుందని మోడీ ప్రశంసించారు.

2015లో ప్రజా రాజధానిగా అమరావతికి తాను శంఖుస్ధాపన చేశానని, గత పదేళ్లుగా అన్ని విధాలా సహకారం అందించామని, ఇప్పుడు చంద్రబాబు నాాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ, హైకోర్టు వంటి నిర్మాణాలకు కూడా కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ వికసిత ఆంధ్రప్రదేశ్ కల కన్నారని, తాము ఇప్పుడు దాన్ని సాకారం చేయాల్సి ఉందన్నారు. ఇది మనం చేయాలి, మనమే చేయాలి బ్రదర్ పవన్ కళ్యాణ్ అన్నారు.

గత పదేళ్లుగా సోషల్, డిజిటల్ మౌలిక సౌకర్యాలపై దేశం దృష్టిసారించిందని, ఇప్పుడు రోడ్డు, రైలు ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఏపీలో కనెక్టివిటీ విషయంలో కొత్త అధ్యాయం లిఖిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. దీని వల్ల యువత, రైతులు, పర్యాటకులు అందరికీ ఉపయోగం ఉంటుందన్నారు. రేణిగుంట-నాయుడుపేట హైవేతో తిరుమల దర్శనం కూడా వేగంగా చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ రైల్వేపై ఎక్కువగా ఫోకస్ చేశాయన్నారు. ఏపీలోని రైల్వేల అభివృద్ధిపై కేంద్రం దృష్టిపెట్టిందన్నారు. 2009-14 వరకూ ఉమ్మడి ఏపీకి 900 కోట్లు కూడా బడ్జెట్ లేదని, ఇప్పుడు ఏపీకి 9 వేల కోట్లు బడ్జెట్ కేటాయించామన్నారు. గతంలో కంటే ఇది 10 రెట్లు ఎక్కువన్నారు. ఏపీలో 100 శాతం రైల్వేల విద్యుదీకరణ పూర్తయిందన్నారు. 8 కొత్త వందేభారత్ రైళ్లు ఇక్కడ పరుగులు తీస్తున్నాయన్నారు. 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

మౌలిక సౌకర్యాల కోసం చేస్తున్న కృషి వల్ల ఎన్నో రంగాలు లబ్ది పొందుతున్నాయన్నారు. సివిల్, రవాణా సహా పలు రంగాలపై దీని ప్రభావం ఉంటుందన్నారు. దీని వల్ల ఏపీలో వేలాది మంది యువతకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం పేదలు, మహిళలు, రైతులు, యువకుల వల్లే అవుతుందని తాను ఎర్రకోట నుంచే చెప్పానన్నారు. ఎన్డీయే విధానాల్లో కూడా ఈ నాలుగు స్తంభాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

రైతులపై భారం పడకుండా ఎరువుల కోసం కేంద్రం 12 లక్షల కోట్లు ఖర్చుచేసినట్లు మోడీ తెలిపారు. ఎరువులతో పాటు సరికొత్త విత్తనాలు కూడా అందించామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో 17500 కోట్ల మేర ఏపీ రైతులకు మేలు చేశామన్నారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన కార్యక్రమం జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా వేగం అందుకుందన్నారు. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాలతో ఆంధ్రప్రదేశ్ దేశానికే కీలకంగా మారిందన్నారు. శ్రీహరికోట నుంచి చేపట్టే ప్రతీ ప్రయోగం కోట్లాది భారతీయుల్ని గర్వపడేలా చేస్తుందన్నారు. డీఆర్డీవో కొత్త మిసైల్ పరీక్షా కేంద్రం నవదుర్గను నాగాయలంకలో తాను ఇవాళ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. దేశ రక్షణ రంగాన్ని ఇది బలోపేతం చేస్తుందన్నారు. భారత దేశ బలం ఆయుధాలు మాత్రమే కాదని, ఐక్యత కూడా అన్నారు. మనలో ఐక్యత పెంచేందుకు దేశవ్యాప్తంగా ఏక్తా మాల్స్ ను నిర్మించబోతున్నట్లు తెలిపారు. విశాఖలోనూ ఓ ఏక్తా మాల్ ను ఏర్పాటుకు శంఖుస్దాపన చేసినట్లు తెలిపారు. భారత వైవిధ్యాన్ని అనుసంధానిస్తూ, ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ భావనను పెంపొందిస్తునట్లు వెల్లడించారు.

జూన్ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ఇప్పుడే చెప్పారని, ఈ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతానని మోడీ హామీ ఇచ్చారు. పదేళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు మోడీ తెలిపారు. మరోసారి ప్రపంచమంతా ఈసారి ఏపీవైపు చూస్తుందన్నారు. యోగాలో వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు ఈ సందర్భంగా ప్రయత్నించాలని కోరుతున్నా. చంద్రబాబు నేతృత్వంలో ఇది సాధ్యమవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేమీ లేదని, వాటిని సాకారం చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారు. ఏపీ ఇప్పుడు తగినంత వేగంతో ముందుకు వెళ్తోందని, దీన్ని మరింత పెంచుకోవాలని మోడీ తెలిపారు. చంద్రబాబు మూడేళ్లలో అమరావతి గురించి కలలు కన్నారని, ఇది రాష్ట్ర జీడీపీని ఏ స్ధాయికి తీసుకెళ్తుందో అంతా గమనించాలన్నారు. ఏపీ అభివృద్ధి కోసం తాను మీతో కలిసి ప్రయాణం చేస్తానని మోడీ తెలిపారు. అందరి ఆశీర్వాదంత ోఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+