Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ విందు రాజకీయంలో ఆ టీడీపీ ఎంపీ ! పార్లమెంట్ క్యాంటీన్లో పనిష్మెంట్ !

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోడీ.. అందుకు తగ్గట్టే హస్తినలో పావులు కదుపుతున్నారు. తమ పాత మిత్రుడు చంద్రబాబును ఢిల్లీకి రప్పించి అమిత్ షా- నడ్డాతో చర్చలు ఏర్పాటు చేయించిన మోడీ.. అనంతరం ఆ పార్టీ ఎంపీ ఒకరిని మరో ఏడుగురు ఎంపీలతో ఇవాళ పార్లమెంట్ క్యాంటీన్ లో విందుకు పిలిచారు.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడితో సహా పలు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలకు ఇవాళ మధ్యాహ్నం పీఎంవో నుంచి హఠాత్తుగా కాల్ వచ్చింది. ప్రధాని మోడీ మీతో పార్లమెంట్ క్యాంటీన్ లో విందుకు సిద్దంగా ఉన్నారనేది ఆ కాల్ సారాంశం. దీంతో వీరంతా షాకయ్యారు. కాసేపట్లో తేరుకుని పార్లమెంట్ క్యాంటీన్ కు పరుగులు తీశారు. అక్కడకు ప్రధాని మోడీ కూడా రావడంతో వీరితో ప్రధాని మోడీ రండి.. మీకో పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానంటూ.. క్యాంటీన్ కు తీసుకెళ్లారు.

pm modi special call for lunch to eight mps including tdps ram mohan naidu amid tdp tie-up talks

ప్రధాని మోడీతో విందు భేటీలో ఏం జరిగిందనే దానిపై సదరు 8 మంది ఎంపీలు నోరు విప్పలేదు. అయితే మోడీతో విందు చేశామంటూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ప్రధాని మోడీ విందు రాజకీయం ఇప్పుడు అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి ఎన్డీయేలోకి చేర్చుకునేందుకు మోడీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా హ్యాట్రిక్ కూడా మరింత బలంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇంతకీ ప్రధాని మోడీతో కలిసి పార్లమెంట్ క్యాంటీన్ లో విందు భోజనం చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గవిట్, ఎస్.ఫాంగ్నాన్ కొన్యాక్, జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఉన్నారు. వీరంతా ప్రధాని మోదీతో కలిసి ఉల్లాసంగా భోజనం చేసి ఫొటోలు కూడా దిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+