నీతి అయోగ్ కు కేసీఆర్ దూరం - నితీశ్ గైర్హాజరు : ఏపీ పురోగతిపై సీఎం జగన్..!!
ఢిల్లీలో కీలకమైన నీతి అయోగ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రధాని మోదీకి లేఖ రాసారు. సీఎం కేసీఆర్ అభ్యంతరాల పైన నీతి అయోగ్ వివరణ ఇచ్చింది. ఇక, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ సైతం ఈ సమావేశానికి హాజరు కావటం లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం లో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. 2019 జులై తర్వాత వ్యక్తిగతంగా హాజరౌతున్న తొలి సమావేశం ఇది.

జాతీయ విద్యా విధానం అజెండా
ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. పంట మార్పిడి, నూనె, పప్పు ధాన్యాల ఉత్పత్తి లో స్వావలంబన సాధించడం పైన చర్చించనునున్నారు, "జాతీయ విద్యావిధానం" అమలు లో భాగంగా పాఠశాల, ఉన్నత విద్యా విధానం, పట్టణ, పుర పాలన లాంటి అంశాలే అజెండాగా ఫిక్స్ చేసారు. ఈ ఏడాది జూన్ లో ధర్మశాలలో ప్రధాని అధ్యక్షతన రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో జరిగిన సమావేశంలో "అజెండా" పై చర్చ జరగనుంది. ఆరు నెలలుగా నిరంతరం జరిగిన పూర్తి స్థాయు చర్చలు, సమీక్షల ఫలితాల పైన రివ్యూ చేయనున్నారు.

అన్ని రాష్ట్రాల పురోగతిపై నివేదికలు
సమగ్రంగా, నిలకడగా దేశం అభివృధ్ది సాధించే దిశగా జరగనున్న చర్చలు ఉంటాయని అధికారులు చెప్పుకొచ్చారు. సమావేశంలో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య మరింత పరస్పర సహకారం పైన సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రులు..లెఫ్టినెంట్ గవర్నర్లు సూచనలు చేయనున్నారు. 75 వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకోబోతున్న ఈ సమయంలో, సమాఖ్య వ్యవస్థకు స్పూర్తిగా రాష్ట్రాలు మరింత శక్తివంతంగా, "ఆత్మ నిర్బర్ భారత్" ను ఆవిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన లో పేర్కొంది.
Recommended Video


కేసీఆర్ గైర్హాజరు - సీఎం జగన్ హాజరు
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాల్లోని స్థితి గతులను ముఖ్యమంత్రులు వివరించనున్నారు. అదే సమయంలో..వచ్చే ఏడాది భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ 20 సమిట్ కి ఆతిధ్య అద్యక్ష దేశంగా సమావేశాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకమని కేంద్రం అభివర్ణించింది. ఇక, కేసీఆర్ గతంలో నీతి అయోగ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయలేదంటూ నిరసన వ్యక్తం చేసారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు..అమలు..పోలవరం అంశాల పైన ఈ సమావేశంలో ప్రస్తావించేందుకు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications