శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మోడీ- ఛత్రపతి విగ్రహానికి ప్రణామం..!
ఇవాళ ఏపీలోని శ్రీశైలంలో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. స్థానికంగా ఉన్న భ్రమరాంబా సమేత మల్లి ఖార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడ కలియ దిరిగారు. ఈ కేంద్రం నిర్వాహకుల్ని అడిగి విశేషాలు తెలుసుకున్నారు. అక్కడి శిలల్ని చూసి ప్రధాని మైమరిచారు.
శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రానికి చంద్రబాబు, పవన్ తో పాటు వచ్చిన ప్రధాని మోడీ.. లోపల అంతా పరిశీలించారు. రాజ్ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర తెలిసేలా ఏర్పాటు చేసిన శిల్పాల్ని మోడీ పరిశీలించారు. అనంతరం శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని దాన్ని తాకి నమస్కరించారు. ధ్యానముద్రలో ఉన్న శివాజీతో పాటు అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్న మోడీ.. అనంతరం పుష్పాలు సమర్పించారు.

శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన శిల్పాలతో పాటు విగ్రహాలు, ఇతర వసతులను కూడా ప్రధాని మోడీ నిశితంగా పరిశీలించారు. అక్కడి విశేషాలను ట్రస్ట్ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ స్ధాయిలో శివాజీ స్పూర్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నందుకు ట్రస్ట్ నిర్వాహకుల్ని ప్రధాని అభినందించారు. ఈ కేంద్రం నిర్వహణ బాగుందని వారికి కితాబిచ్చారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాని మోడీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications