జగన్, చంద్రబాబుకు మోడీ అసలు పరీక్ష ? తేడా వస్తే ఓటు బ్యాంక్ చెల్లాచెదురు !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ను నడుపుతున్న బీజేపీ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల పేరుతో నెట్టుకొస్తోంది. అలాగే బీజేపీ అండ లేకపోతే ఏం జరుగుతుందో 2019 ఎన్నికల్లో రుచి చూసిన చంద్రబాబు ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత తిరిగి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో కేంద్రం తీసుకుంటున్న ఓ నిర్ణయం ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీకి శరాఘాతంగా మారబోతోంది. ఇంకా చెప్పాలంటే ఈ సమస్యను అధిగమించడంలో లౌక్యంగా వ్యవహరించలేకపోతే మాత్రం కచ్చితంగా ఆయా పార్టీల ఓటు బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడక తప్పదు. అదీ దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ రెండు పార్టీలకు నేతృత్వం వహిస్తున్న వైఎస్ జగన్, చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

pm modis real test to ys jagan and chandrababu with uniform civil code bill-how it will impact?

దేశవ్యాప్తంగా ఒకే పౌరస్మృతిని అమల్లోకి తెచ్చేందుకు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఎప్పటి నుంచో బీజేపీ అజెండాలో ఉన్న ఈ అంశానికి సుప్రీంకోర్టు నుంచి కూడా మద్దతు లభించడంతో ఇక ఏ అడ్డంకులు లేవనే కారణం చూపి పార్లమెంటులో బిల్లు పెట్టి నెగ్గించుకునేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే లోక్ సభ వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రాజ్యసభలో ఈ బిల్లు నెగ్గాలంటే మాత్రం వైసీపీ, టీడీపీ మద్దతు తప్పనిసరి. ఈ రెండు పార్టీలు బిల్లును వ్యతిరేకించినా, ఓటింగ్ కు దూరంగా ఉన్నా బీజేపీకి భారీ షాక్ తప్పదు.

ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు లా కమిషన్ తో అభిప్రాయ సేకరణ చేయిస్తున్న మోడీ సర్కార్.. అదే సమయంలో వైసీపీ, టీడీపీల్ని ఈ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతోంది. అయితే రాష్ట్రంలో భారీ ఎత్తున ముస్లిం ఓటు బ్యాంకు అండ ఉన్న వైసీపీతో పాటు ముస్లింలలో కొన్ని వర్గాల మద్దతున్న టీడీపీకి కూడా ఉమ్మడి పౌరస్మృతి బిల్లు సవాల్ విసురుతోంది. ఈ బిల్లుకు మద్దతు తెలిపితే గతంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న పరిస్దితులు ఇప్పుడు ముస్లింలతో పాటు ఇతర వర్గాల నుంచి తమకు ఎదురవుతాయని జగన్, చంద్రబాబు భయపడుతున్నారు.

pm modis real test to ys jagan and chandrababu with uniform civil code bill-how it will impact?

ఈ నేపథ్యంలో తాజాగా జగన్, చంద్రబాబు ఇద్దరూ తమ పార్టీలకు చెందిన లేదా అనుకూలంగా ఉన్న ముస్లిం నేతల్ని, ప్రజాప్రతినిధుల్ని పిలిపించుకుని మాట్లాడారు. అయితే ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామనే ఓ పరోక్ష హామీని మాత్రమే వారికి ఇచ్చి పంపారు. అంతే కానీ యూసీసీ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇప్పుడు జగన్, చంద్రబాబు మోడీ ఒత్తిడికి తలొగ్గి బిల్లుకు అండగా నిలుస్తారా లేక ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని కనీసం ఓటింగ్ కు దూరంగా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+