వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కళ్యాణ్‌కు మోడీ షాక్: మహేష్‌బాబు‌కు లేఖ, కారణమదేనా?

‘స్వచ్ఛతేసేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని టాలీవుడ్ ప్రముఖులకు లేఖ రాశారు.పవన్‌కళ్యాణ్‌కు మోడీ షాకిచ్చారు. పవన్‌కు మాత్రం లేఖ రాలేదు.బిజెపి తీరుపై పవన్ ఇటీవలకాలంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi's letters to celebrities But Why Modi skipped Pawan? పవన్‌ కు మోడీ షాక్ | Oneindia Telugu

హైదరాబాద్: ప్రధానమంత్రి మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు. 'స్వచ్ఛతేసేవ' కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ పవన్‌కాల్యాణ్‌ మినహా తెలుగు సినిమాలోని పలువురు ప్రముఖులకు ప్రధాని లేఖలు రాశారు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పవన్‌కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.

అయితే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంపై పవన్‌కళ్యాణ్ బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి నేతలను దుమ్మెత్తిపోశారు.కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌కు చిరంజీవి షాక్: రాజకీయాలకు మెగాస్టార్ గుడ్‌బై, ఇక సినిమాలకేకాంగ్రెస్‌కు చిరంజీవి షాక్: రాజకీయాలకు మెగాస్టార్ గుడ్‌బై, ఇక సినిమాలకే

ప్రత్యేక హోదా వల్లే ఏపీ రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతోందని పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆయన ఏపీ ప్రజలను కోరారు. 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీచేసేందుకు జనసేన పార్టీ సన్నాహలు చేస్తోంది.

అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో జనసేన కార్యకర్తల ఎంపిక ప్రక్రియ కూడ పూర్తైంది. మరోవైపు సినిమాలకు జనసేనాని పవన్‌కళ్యాణ్ గుడ్‌బై చెప్పనున్నారు. 2017 అక్టోబర్‌ నుండి పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు.

పవన్‌కళ్యాణ్‌కు మోడీ షాక్

పవన్‌కళ్యాణ్‌కు మోడీ షాక్

జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ షాక్ ఇచ్చారు. ‘స్వచ్ఛతేసేవ' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దేశంలోని వివిధ రంగాల ప్రముఖులకు మోదీ లేఖలు రాశారు. దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు మోహన్‌బాబు, స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్‌బాబులకు ప్రధాని లేఖలు రాశారు.అయితే పవన్‌కళ్యాణ్‌కు మాత్రం లేఖ రాలేదు. జనసేనాని పవన్‌కళ్యాణ్‌కు బిజెపి నేతల మధ్య ఆగాధం ఏర్పడిందని ఈ ఘటనతో అర్ధమౌతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక హోదా డిమాండ్ ఆందోళనే కారణమా?

ప్రత్యేక హోదా డిమాండ్ ఆందోళనే కారణమా?

2014 ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టిడిపి, బిజెపి కూటమికి మద్దతుగా పవన్‌కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని పవన్‌కళ్యాణ్ ఆరోపించారు. బిజెపిపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలోని పలు చోట్ల విద్యార్థులతో ప్రత్యేక హోదా కోసం సభలు నిర్వహించారు. టిడిపి ఎంపీలపై కూడ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ కేంద్రం వివక్ష చూపుతోందంటూ పవన్‌ విమర్శలు గుప్పించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మోడీ పవన్‌కళ్యాణ్‌కు లేఖ రాయలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతోంది.

రాజకీయంగా బలపడేందుకు పవన్ ఎత్తుగడ

రాజకీయంగా బలపడేందుకు పవన్ ఎత్తుగడ

ప్రత్యేక హోదా విషయంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీని అమలు చేయడంలో కేంద్రం వైఫల్యం చెందిందని కేంద్రంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సభలు నిర్వహించడం రాజకీయంగా మైలేజీకి ఉపయోగపడింది. ప్రజల సమస్యలపై స్పందిస్తానని ప్రకటించిన పవన్‌కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశంపై బిజెపి తీరును ఎండగట్టారు. రానున్న రోజుల్లో ఈ అంశం పవన్‌కు కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 నాడు ఆలింగనం చేసుకోన్నారు, నేడ

నాడు ఆలింగనం చేసుకోన్నారు, నేడ

‘స్వచ్ఛతేసేవ' కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సెలబ్రిటీలకు ప్రధానమంత్రి మోడీ లేఖలు రాశారు. కానీ, తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరికీ లేఖలు రాశారు.కానీ, గత ఎన్నికల్లో తమతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్‌కు మాత్రం లేఖ రాయకపోవడం మాత్రం తీవ్ర చర్చకు కారణమైంది.గత ఎన్నికలకు ముందు పవన్.. మోదీని కలిశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో మోదీతో కలిసి అనేక సభల్లో పాల్గొన్నారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పవన్ కూడా వెళ్లారు. ఆ సందర్భంగా ప్రధానిని పవన్ ఆళింగనం చేసుకుని ఆహ్వానించారు. అంతేకాదు మరో సందర్భంగా పవన్‌ను మోదీ పొగిడారు. ఇంతటి సాన్నిహిత్యం ఉన్న పవన్‌కు మోదీ లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

English summary
As his pet 'Clean India' campaign completes three years, Prime Minister Narendra Modi has written to opinion makers across fields including industry, sports and cinema seeking their support for the 'Swachhata Hi Seva' movement, saying it is the most noble service.Modi wrote letters to hollywood celebrities except Pawan kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X