Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి ఎక్కడా.. అరెస్ట్ చేశారా.. లేదా..!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ లో హైడ్రామా కొనసాగుతోంది. ఆయన అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కానీ పిన్నెల్లిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. ఇంతకీ పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. పోలింగ్ రోజే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే ఇదంతా ఉండేది కాదని విమర్శలు వస్తున్నాయి.
మే 13 పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పల్నాడు జిల్లాలోని పాల్వాయి గేట్ లో పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లాడు. అక్కడ ఈవీఎంను నేలకేసి బద్ధలు కొట్టాడు. దీంతో అదే రోజు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి హైదరాబాద్ కు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో ఈసీ సీరియస్ అయింది.

వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు బుధవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. కేపీహెచ్‌బీలోని ఇందూ విల్లాస్ వద్దకు చేరుకున్న పోలీసుల బయట కాపు కాపు కాశారు. కాసేపటి తర్వాత రామకృష్ణా రెడ్డి కారు బయటకు రావడంతో ఆ కారును వెంబడించారు. ఆ కారు 65 నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తుండడంతో సంగారెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు.
పోలీసులకు దొరికిపోతామని భావించిన కారు డ్రైవర్ కారును పటాన్ చెరు దాటిన తర్వాత రుద్రారం వైవు మళ్లించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆపారు. వెనకాలే వెళ్లిన ఏపీ పోలీసులు కారులో ఉన్న డ్రైవర్, గన్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి ఫోన్ తమకు ఇచ్చి డివైడర్ దాటి మరో వాహనంలో వెళ్లిపోయారని చెప్పారు. అయితే పిన్నెల్లి సోదరలు తమిళనాడు పారిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications