సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన వంశీ - ఆ తరువాత..!!
వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యాలయం పై దాడి కేసు విచారణ వేగవంతం చేసారు. ఈ కేసులో వంశీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు ఈ నెల 20న తీర్పు ఇవ్వనుంది. ఇదే సమయంలో విజయవాడ పోలీసులు వంశీని అరెస్ట్ చేసారు. కాగా, పోలీసులు టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ ను వంశీని కిడ్నాప్.. బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అరెస్ట్ వెనుక
వల్లభనేని వంశీ అరెస్ట్ లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాల యంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై కేసు నమోదైంది. పార్టీ కార్యాల యంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది. ఈ సమయంలోనే
ఆకస్మికంగా సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. తాను ఇచ్చిన ఫిర్యాదును రెండు రోజుల క్రితం వెనక్కు తీసుకున్నారు.

కిడ్నాప్ - బెదిరింపు
ఇప్పుడు హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం వెనుక అసలు విషయం బయటకు వచ్చింది. సత్యవర్ధన్ తన ఫిర్యాదు ఉప సంహరించుకోవటం వెనుక వంశీ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్య వర్ధన్‌ను ఆ రోజు వంశీ అనుచ రులు కారులో కోర్టుకు తీసుకువచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు.
విజయవాడకు తరలింపు
ఈ కిడ్నాప్ - బెదిరింపు కేసులో వంశీతో సహా మొత్తం ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనలో వంశీ ప్రమేయం పైన ఆధారాలు సేకరించారు. కోర్టులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అసలు ఫిర్యాదునే ఉప సంహరించుకునేలా వంశీ తన అనుచరులతో కలిసి సత్య వర్ధన్ పైన ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో, సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ తో హైదరాబాద్ లో ఉన్న వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు. పటమట స్టేషన్ లో వంశీ పైన ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఈ మధ్నాహ్నం పోలీసులు ఈ అరెస్ట్ కారణాలను వెల్లడించనున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications