మేయర్ హత్యకు 2సార్లు చింటూ ప్రయత్నం: గర్ల్స్‌తో జల్సాలా.. కాల్ మనీపై బోడె కంటతడి

చిత్తూరు: సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్‌తో పాటు ఇప్పటి వరకు ఇరవై మందిని అరెస్టు చేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సోమవారం నాడు తెలిపారు.

ఈ కేసులో 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాన్నారు. కేసు విచారణఅ కొనసాగుతోందన్నారు. మరో పన్నెండు మందిని విచారిస్తున్నామన్నారు. మేయర్ దంపతుల హత్యకు నిందితులు ఆరు నెలల ముందుగానే పథకం రచించారని చెప్పారు.

మేయర్‌ను హత్య చేసేందుకు చింటూ గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడని ఎస్పీ వెల్లడించారు. ఈ హత్యలు 23 మంది కుట్రదారులు ఉన్నారని, మరో ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.

Police arrested 20 accused in Mayor Anuradha murder case

బోడె ప్రసాద్ కంటతడి!

కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియా ముందు కంటతడి పెట్టారు. తాను తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి ఫోటోలు దిగి, సామాజిక మాధ్యమాల్లో పెడితే, తమవారి ముఖాలను మార్ఫింగ్ చేసి అమ్మాయిలతో జల్సాలు చేస్తున్నానని ప్రచారం చేశారని ఆరోపించారు.

కాల్ మనీలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సీబీఐ విచారణకైనా సిద్ధమేనన్నారు. కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకే తన పేరును తెరపైకి తెచ్చారన్నారు. వెనిగళ్ల శ్రీకాంత్ తనకు మిత్రుడు మాత్రమేనని, కాల్ మనీలో తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+