మాజీ మంత్రిపై పోలీసులు దౌర్జన్యం.. అనుచరుడి అరెస్ట్ ?
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
విడదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు ఆపి, శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్‌ను తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు విడదల రజనికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజినీ పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. అంతే కాకుండా మీ పైన కూడా కేసు పెడతానంటూ పోలీసు అధికారి ఆమెను హెచ్చరించిన వీడియో వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే ఒక మహిళ, మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ఆమెపై కేసు నమోదైంది. అదే కేసులో ఆమె మరిది గోపీని సైతం గత నెలలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ చేదు అనుభవం ఎదురవ్వడం మాజీ మంత్రికి మరో షాక్ అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications