కారులో 65లక్షల బ్లాక్ మనీ : పోలీసులు పట్టేసుకున్నారు..

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 65లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మద్దిపాడు : పెద్దనోట్ల రద్దు తర్వాత.. భారీ మొత్తంలో కూడబెట్టుకున్న నల్లధనాన్ని వైట్ గా ఎలా మార్చుకోవాలన్న ప్రయత్నాల్లో మునిగిపోయారు చాలామంది నల్లకుబేరులు. ఈ క్రమంలో కొంతమంది కమిషన్ ఏజెంట్ల చేతిలో మోసపోతుంటే.. మరికొంతమంది వాటిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

Police find huge amount in car

తాజాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 65లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి సరైన ధ్రువ పత్రాలేవి లేకపోవడం వల్లే నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.

నగదుతో పాటు డబ్బును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ డబ్బును వారు ఒంగోలు నుంచి గుంటూరు తరలిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నగదును గుంటూరుకు చెందిన కోట హన్మంతుదిగా గుర్తించారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఐటీ శాఖకు అప్పగించనున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+