నన్నపనేని తీవ్ర వ్యాఖ్యలు: పోలీసుల ఆగ్రహం, కౌంటర్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యల పైన విజయవాడ పోలీసులు మండిపడుతున్నారట. నన్నపనేని రాజకుమారి ప్రయివేటు పని మీద వచ్చారని పోలీసులు చెబుతున్నారు. సిద్ధార్థ నగర్‌లోని వంద కోట్ల విలువైన సివిల్ వ్యవహారంలో ఆమె ఓ వర్గానికి కొమ్ముకాస్తూ వచ్చారన్నారు.
నన్నపనేని వ్యాఖ్యలు సరికాదన్నారు. అన్నదమ్ముల మధ్య సివిల్ వ్యాజ్యం కోర్టులో ఉందని తెలిపారు. విషయం తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఆ విషయంలో అవగాహన లేని కొంతమంది పెద్దలు ఈ వివాదంలో కలుగజేసుకుని పోలీసులపై ఒత్తిడి పెంచడం సరికాదన్నారు. నన్నపనేని పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కాగా, సివిల్ వ్యవహారంలో కుటుంబ సభ్యుల హింసకు గురైన ఒక మహిళకు మద్దతు తెలుపుతూ విజయవాడకు వచ్చిన నన్నపనేని రాజకుమారి విజయవాడ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆమె పోలీసులపై మండిపడ్డారు.
విజయవాడ పోలీసులు పని చేయరా అని నిలదీశారు. కాల్ మనీ, అయేషా హత్య కేసు.. ఇలా ఏ కేసులోనూ పని చేయడం లేదని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక మహిళను ఇంట్లో బంధిస్తే ఎందుకు పట్టించుకోలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications