ఎర్ర దొంగలపై పోలీసుల కాల్పులు: 150ఎర్రచందనం దుంగలు సీజ్

Subscribe to Oneindia Telugu

కడప: జిల్లాలోని రైల్వే కోడూరు మండలం తీండ్రగుంట అటవీప్రాంతంలో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు వచ్చిన 150 మంది కూలీలను 70 మంది టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది చుట్టుముట్టారు.

ఎర్రచందనం కూలీలు ప్రతిఘటించడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో తీండ్రగుంట అటవీప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోడూరు, తిరుపతి వైపు నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కూలీలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Police firing on red sanders

సమాచారమందుకున్న ఐజీ కాంతారావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. 150 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పలువురు ఎర్రచందనం దొంగలు పరారయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police firings on red sanders in Kadapa district on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X