ఏపీలో గతం కంటే ఎక్కువ పట్టుబడిన నగదు, లిక్కర్, డ్రగ్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా లభ్యమైన నగదు, లిక్కర్, డ్రగ్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈసారి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ తాజాగా వెల్లడించింది.
ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.

2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 150 బోర్డర్ చెక్ పోస్ట్‌ల్లో పోలీస్, సెబ్, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో దాడులు నిర్వహించినట్లు పోలీసు శాఖ తెలిపింది.

Police have seized heavy cash and liquor drugs in this elections in andhra pradesh

35 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 15 తాత్కాలిక చెక్ పోస్ట్ లలో నిఘా ద్వారా వీటిని పట్టుకున్నట్టు వెల్లడించింది ఏపీ పోలీసు శాఖ. ఈ ఎన్నికల్లో మొత్తంగా 3466 వాహనాలు సీజ్ చేశారు.

2019 ఎన్నికల్లో రూ.41.80 కోట్లు స్వాధీనం చేసుకోగా.. 2024 ఎన్నికల్లో రూ.107.96 కోట్లు సీజ్ చేశారు. 7305 మందిని అరెస్ట్ చేశారు. ఇక, 2019 ఎన్నికల్లో రూ.8.97 కోట్ల విలువ మద్యాన్ని సీజ్ చేయగా.. 2024 ఎన్నికల్లో రూ.58.70 కోట్ల విలువ మద్యాన్ని సీజ్ చేశారు.

2019 ఎన్నికల సందర్భంగా రూ.5.04 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయగా.. 2024 ఎన్నికల్లో రూ. 35.61 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 1730 మందిని అరెస్ట్ అరెస్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో రూ.27.17 కోట్లు సీజ్ చేయగా.. 2024 ఎన్నికల్లో రూ.123.62 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 42 మందిని అరెస్ట్ చేశారు. 2019 ఎన్నికలలో రూ.10.63 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసే వస్తువులు సీజ్ చేయగా, 2024 ఎన్నికల్లో రూ. 16.98 కోట్లు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 233 మందిని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+