రెండు హత్యలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు

దాంతో అతను ఆరేడేళ్ల క్రితం చేసిన రెండు హత్యల విషయాన్ని అతను బయటపెట్టాడు. ఒకరిని తాను అద్దెకు ఉంటన్న ఇంట్లోనే హత్య చేసి, ఆ ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టాడు. మరోటి కిరాయి హత్య. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడు పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు.
వివరాలు ఇలా ఉన్నాయి - బీహార్‌కు చెందిన కిరణ్ అలియాస్ రాజేష్ హైరాబాద్‌లోని ఫతేనగర్‌కు చెందిన మరో వర్గం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యాపిల్లలతో కలిసి 2008లో గాజులరామారాం డివిజన్ చంద్రగిరిలోని ఓ మాజీ కౌన్సిలర్ ఇంట్లో అద్దెకు దిగాడు. వీరి పక్క గదిలో యూసుఫ్, షంషూద్దీన్ అనే యువకులు ఉండేవారు. కిరణ్ భార్యతో యూసుఫ్ సన్నిహితంగా మెలిగేవాడు.
ఎన్నిసార్లు మందలించినా యూసుఫ్ వినలేదు. దీంతో షంషుద్దీన్ నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో తన భార్య సహకారంతో 2008లో యూసుఫ్‌ను ఇంట్లోనే హత్య చేశాడు. శవాన్ని ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత భార్యతో ఇల్లు ఖాలీ చేసి మరోచోటికి వెళ్లిపోయాడు.
ఆ హత్యకు ముందు కిరణ్ 2007లో మరో హత్య చేశాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తిని సుపారీ తీసుకుని హత్య చేశాడు. ఆ రెండు హత్యలు బయటకు పొక్కకపోవడంతో అతను దర్జాగా తిరుగుతున్నాడు. ఎన్నికల్లో తనిఖీల్లో భాగంగా ఆటోలో వెళ్తున్న కిరణ్‌ను పోలీసులు ఆపారు. యూసుఫ్ అస్తిపంజరాన్ని పోలీసులు వెలికి తీశారు. హత్యకు గురైన రెండో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications