పోలీసుల రక్షణలో మంత్రి ప్లెక్సీలు. తాడేపల్లిగూడెంలో మంత్రి ఫ్లెక్సీలకు పోలీసు కాపలా
తాడేపల్లిగూడెం : మంతులకే కాదు...వారి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కూడ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.ఇదే విచిత్రమని అనుకొంటున్నారా....ఇదేక్కడో జరగలేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటు చేసుకొంది ఘటన. పోలీసులు ఏకంగా మంత్రి ఫ్లెక్సీలకు కాపలా కాస్తున్నారు. మంత్రి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకుండా ఖాకీలు కాపలాకాస్తున్నారు.కొన్ని రోజులుగా తాడేపల్లి గూడెంలో ఫ్లెక్సీల వివాదం సాగుతోంది.ఈ వివాదంలో భాగంగానే మాజీ ఎంఏల్ఏ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాల్లో చిన్న వివాదం పోలీసు కేసలుు... అరెస్టు వరకు వెళ్ళింది.తాడేపల్లి గూడెంలో బస్టాండ్ ఎదుట వీదిలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు నివాసం ఉంటున్నారు. అదే వీధిలో మాజీ ఎం ఏల్ ఏ కొట్టు సత్యనారాయణ కూడ నివాసం ఉంటున్నారు.మంత్రి మాణిక్యాలరావు నివాసం ఉండే వీదిలో ఆయన అనుచరులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఏకంగా మంత్రి ఫ్లెక్సీలకు కూడ కాపలా ఉన్నారు.

మాజీ ఎంఏల్ ఏ, వైఎస్ ఆర్ సి పి పార్టీ నాయకుడు కొట్టు సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అనుచరులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.అయితే ఈ ఫ్లెక్సీల ఏర్పాటు సందర్భ:గా మంత్రి ఫ్లెక్సీలకు అడ్డు పెట్టారని మంత్రి అనుచరులు అడ్డుపడ్డారు. దరిమిలా మంత్రి అనుచరులు, మాజీ ఎంఏల్ ఏ కొట్టు సత్యనారాయణ అనుచరులు వాగ్వావాదానికి దిగారు. కేసుల వరకు వెళ్ళింది. పోలీసులు మాజీ ఎంఏల్ఏ కొట్టు సత్యనారాయణపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications