మన్యంలో రేవ్ పార్టీ:యధేచ్చగా మందు,విందు,పొందు...పట్టుబడ్డ 34 మంది యువతీయువకులు

తూర్పుగోదావరి:రేవ్ పార్టీల విష సంస్కృతి నగరాలు,పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు సైతం విస్తరిస్తోంది. యువత స్త్రీపురుషులనే తేడా లేకుండా తెల్లవార్లూ తాగితందనాలాడటమే కాదు మధ్య మధ్యలో లైంగిక విశృంఖలానికి పాల్పడుతుండటమే రేవ్ పార్టీ పేరిట సాగితే తంతు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒకచోట జరుగుతున్న రేవ్ పార్టీ పోలీసులకు సైతం విస్మయపరిచింది. కారణం ఎక్కడో కాస్మోపాలిటన్ సిటీల్లో జరిగే రేవ్ పార్టీ మన్యం ప్రాంతంలో జరగటమే పోలీసులు విస్తుపోవడం వెనుక రీజన్. ఏజెన్సీ ఏరియాలో జరుగుతున్న ఈ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 34 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున నగదు, మద్యం బాటిళ్లు, కండోమ్ లను స్వాధీనం చేసుకున్నారు.

 Police raid rave party in East Godavari, arrest 34 youth

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట పంచాయతీ పరిధిలోని దేవరాతిగూడెం సుద్దగొమ్ము వద్ద ఏవన్‌ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ రేవ్ పార్టీలో భాగంగా మద్యం మత్తులో...అసభ్య నృత్యాలతో...అశ్లీల కార్యక్రమాలతో చెలరేగిపోతున్న యువతీయువకులు...అక్కడి పరిస్థితి చూసి పోలీసులే విస్తుపోయారు. అనంతరం 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వీరిలో 22 మంది యువకులు, 8 మంది మహిళలు...కాగా మరో నలుగురు రిసార్ట్స్‌ సిబ్బంది.

కాగా విజయవాడకు చెందిన 21 మంది వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు రేవరాతి గూడెంలోని ఈ ఎ-1 రిసార్ట్‌ను రిజర్వ్‌ చేసుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలం నుంచి రూ.94,260 నగదుతోపాటు,మద్యం బాటిళ్లు, కండోమ్‌లు, ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన విచారణలో ఈ రిసార్ట్స్‌లో గత కొంత కాలంగా వరుసగా రేవ్‌ పార్టీలు జరుగుతున్నట్లు తెలిసిందని సమాచారం.

అనంతరం వీరందరిపై కేసు నమోదు చేసి పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలుస్తోంది. రిసార్టును సీజ్‌ చేసి, నిర్వాహకుడు మహర్షి ఎలియాస్‌ బాబ్జీ కోసం గాలిస్తున్నామని అతడు పరారీలో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+