రేవ్‌పార్టీ భగ్నం, గర్ల్స్ అరెస్ట్: చెన్నై గర్ల్‌పై రేప్ యత్నం

Rave Party
హైదరాబాద్/చిత్తూరు: రాష్ట్ర రాజదాని హైదరాబాదులో ఓ రేవ్ పార్టీని నగర పోలీసులు భగ్నం చేశారు. శామీర్ పేట్ ఓ రిసార్ట్ లో జరుగుతున్న ఒక రేవ్ పార్టీపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో ముప్పై మంది యువకులు, పది మంది యువతులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చెన్నై యువతిపై అత్యాచారయత్నం

శ్రీకాళహస్తి ఆలయం దగ్గర దారుణం జరిగింది. రాహుకేతువుల పూజకోసం వచ్చిన ఓ యువతిని కామాంధులు కాటేయబోయారు. చెన్నై చెందిన ఓ కుటుంబం శ్రీకాళహస్తికి వచ్చింది. వీరు భిక్షాల గాలిగోపురం మార్గంలో ఆలయంలోకి వెళుతుండగా ఓ దుకాణంలో పని చేసే కొందరు యవకులు పలుకరించి, ఏ పూజలు చేయించుకోవాలని ఆరా తీశారు. తమ కుమార్తెకు పెళ్లి కానందున దోష నివారణకు పూజలు చేయించుకునేందుకు వచ్చామని వారు తెలిపారు.

దీంతో వారు తాము అతి తక్కువ ధరకు వసతి కల్పిస్తామంటూ భిక్షాల గాలిగోపురం సమీపాన ఓ చిన్న గది చూపారు. అర్ధరాత్రి దాటాక ఓ యువకుడు వెళ్లి ఈ సమయంలో పూజలు చేసుకుంటే మంచిదని నమ్మించాడు. ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లాడు.

అక్కడ మరో ఇద్దరు తోడయ్యారు. దోషం తొలగాలంటే పూజ చేసుకునేవారు మాత్రమే ఉండాలని నమ్మించి, ఆ యువతి తండ్రిని బయటకు పంపారు. ఆ తర్వాత పూజలో నిమగ్నమైన యువతిపై అత్యాచారానికి యత్నించడంతో ఆమె కేకలు పెట్టగా దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత కుటుంబం అక్కడి నుండి వెళ్లిపోయింది.

కుక్కల దాడిలో బాలుడి మృతి

మెదక్ జిల్లా దొల్తాబాద్ మండలంలో నాలుగేళల్ బాలుని పైన కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటున్నారు. అతను నానమ్మ వద్ద ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+